వార్డు వాలంటీర్లు మొబైల్‌ ఫోన్లు అప్పగించాలి, హైకోర్టు ఆదేశాలు

Andhra Praedsh HC, Andhra Praedsh HC orders ward volunteers to deposit mobiles, AP Elecctions, AP High Court, AP High Court Issued Orders, AP High Court Issued Orders over Ward Volunteers Mobile Phones, AP High Court quashes SEC orders, AP High Court reserves verdict on SEC orders, AP SEC, HC suspends AP order on volunteers, HC suspends SEC order grounding ward volunteers, Keep phones of volunteers with poll officials, Mango News, Ward Volunteers Mobile Phones

ఆంధ్రప్రదేశ్ లో వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్‌ ఫోన్లను మున్సిపల్‌ ఎన్నికల అధికారులకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చింది. ముందుగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగా వాలంటీర్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో లబ్ధిదారుల డేటా ఉండడంతో వాటిని కూడా స్వాధీనపరచాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ అనంతరం మొబైల్‌ ఫోన్లు అప్పగించాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్‌ జడ్జి ఆదేశాల అనంతరం ఎస్‌ఈసీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వద్ద అప్పీల్‌ చేసింది. దీంతో శుక్రవారం నాడు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపి వార్డు వాలంటీర్లుకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్‌ ఫోన్లను మున్సిపల్‌ అధికారుల వద్ద అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 10 =