ఏపీలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ లో ఫెయిలైన వారికి ‘కంపార్టుమెంటల్‌’ పాస్

AP Advanced Supplementary and Improvement Exams, AP Inter Board, AP Inter Board Key Decision On Advanced Supplementary, AP Inter Board Latest News, AP Inter Improvement ExamsRemove, AP Inter supplementary, AP Inter Supplementary Exams, AP Intermediate board decides to pass failed students

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్మీడియట్‌-2020 పరీక్షల్లో సెకండ్ ఇయర్ లో ఫెయిలై అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరిని కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాసు చేస్తున్నట్లుగా ఏపీ ఇంటర్‌ బోర్డు తాజాగా ప్రకటించింది.

విద్యార్థులు ఫెయిలైన సబ్జెక్టులకు పాస్‌ మార్కులు వేస్తూ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాస్‌ చేసినట్లుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ వెల్లడించారు. అలాగే మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ కు సంబంధించి ఫస్ట్ ఇయర్ విద్యార్థులంతా 2021 మార్చ్/ఏప్రిల్‌లో జరిగే పరీక్షల్లో రాసుకోవాలని సూచించారు. ఆ సమయంలో సెకండ్ ఇయర్‌ పరీక్షలతో పాటుగా ఫస్ట్ ఇయర్‌ సబ్జెక్టులకు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు కూడా హాజరుకావొచ్చని తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =