కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

Kakinada MLC Anantha Babu, MLC Anantha Babu Remand Extended, MLC Anantha Babu, Kakinada MLC Anantha Babu Remand, Mango News, Mango News Telugu, Anantha Babu Latest News And Updates, Kakinada MLC Remand Has Been Extended, Kakinada MLC Anantha Latest Remand News, Anantha Babu, Anantha Babu MLC, MLC Anantha Babu Remand, MLC Anantha Babu News And Live Updates, MLC Anantha Babu, AP Political News

కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)కు మరోసారి రిమాండ్‌ పొడిగించబడింది. ఈ మేరకు శుక్రవారం ఆయనకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను పొడిగించింది. కాగా దీనికిముందు అనంతబాబుకు విధించిన రిమాండ్ గడువు నేటితో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అనంతబాబు రిమాండ్‌ను అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీని పోలీసులు తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఇదే కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు కాలయాపన చేస్తున్నారని నిందితుల తరపు న్యాయవాది అన్నారు.

కాగా ఎమ్మెల్సీ అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బెయిల్‌ కోసం అనంతబాబు పలుసార్లు దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించింది. అయితే ఇటీవల అనంతబాబు తల్లి మృతి చెందడంతో 14 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా హైకోర్టులో అనంతబాబు రెగ్యులర్ బెయిల్‌పై ఈనెల 26న విచారణ జరుగనుంది. ఇక తన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబును పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 7 =