ఏపీలో కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు ఇస్తాం – మంత్రి ఆర్కే రోజా

AP Minister RK Roja Announces Identity Cards To be Allocated For Eligible Artists in The State, Minister RK Roja Announces Identity Cards To be Allocated For Eligible Artists in The State, RK Roja Announces Identity Cards To be Allocated For Eligible Artists in The State, Identity Cards To be Allocated For Eligible Artists in The State, Identity Cards To be Allocated For Eligible Artists, Identity Cards, Identity Cards For Artists, AP Sports Minister RK Roja, AP Sports Minister, Minister RK Roja, RK Roja, Artists, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లోని కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. వెలగపూడిలోని తాత్కాలిక ప్రభుత్వ సముదాయంలో ఆమె గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్‌ భార్గవ, సాంస్కృతిక అకాడమీల చైర్‌పర్సన్లు, సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లికార్జున సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని తెలుగు కళాకారులను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తామని పేర్కొన్నారు.

త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సాంస్కృతిక పోటీలను అధికారికంగా నిర్వహించనున్నామని, ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సీఎం వైఎస్‌ జగన్‌ చేతులమీదుగా అవార్డులు ప్రదానం చేయిస్తామని మంత్రి రోజా వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని అరుదైన తెలుగు కళా రూపాలను పరిరక్షించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా కళారూపాల జాబితాను సిద్ధం చేయాలని, ఆడిటోరియాలను గుర్తించి కళారూపాల ఛాయాచిత్రాలను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. పల్లెల్లోని కళాకారులను గుర్తించేందుకు స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల సేవలను వినియోగించు కోవాలని మంత్రి ఆర్కే రోజా అధికారులకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + six =