జేఈఈ అడ్వాన్స్‌డ్-2021 పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా

IIT-JEE Advanced 2021 registration, JEE Advanced 2021, JEE Advanced 2021 Exam, JEE Advanced 2021 Exam Registration, JEE Advanced 2021 Exam Registration Postponed, JEE Advanced 2021 registration, JEE Advanced 2021 Registration Date Postponed, JEE Advanced 2021 registration postponed, JEE Advanced Registration Postponed, JEE Main Result 2021 Live, Mango News

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్-2021 పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. ముందుగా సెప్టెంబర్ 11 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్-2021 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం కావాల్సి ఉండగా, జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాప్యం వలన ఆ ప్రక్రియ వాయిదా వేయబడిందని ఇనిస్టిట్యూట్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ వెల్లడించింది. కాగా సెప్టెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు సెప్టెంబర్ 20వ సాయంత్రం 5 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

జేఈఈ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థుల మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు అనంతరం అడ్మిట్ కార్డ్స్ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు అభ్యర్థులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక అక్టోబర్ 3వ తేదీన రెండు షిఫ్ట్‌లలో జేఈఈ అడ్వాన్స్‌డ్-2021 పరీక్షను నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + six =