ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్‌ ఫోకస్‌

Chandrababu and Pawan Kalyan Road Show, Pawan Kalyan Road Show, Godavari District Road Show, Road Show, Chandrababu, Pawan Kalyan, Assembly Elections 2024, Janasena, TDP, BJP, Both Godavari District, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Chandrababu, Pawan Kalyan,Assembly Elections 2024, Janasena,TDP, BJP,Chandrababu and Pawan Kalyan road show,both Godavari district

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాలలో దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ కలిసి ప్రచారం చేయబోతున్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ కలిసి తొలిసారి ఉమ్మడిగా జిల్లాలలో పర్యటిస్తుండటంతో.. వీరిద్దరి పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు చంద్రబాబు,పవన్‌ ఉమ్మడి వ్యూహంతో కూటమిలో అసంతృప్తులను చల్లారుస్తురా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  టికెట్‌ దక్కని  అసంతృప్త నేతలు ఒక్క తాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ కలిసి రెండ్రోజులపాటు ఉభయగోదావరి జిల్లాల్లో  రోడ్‌ షో, బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో  వీరిద్దరూ రోడ్‌షో నిర్వహిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు. నిడదవోలు గణేష్‌చౌక్‌ సెంటర్‌లో రాత్రి 7 గంటలకు రోడ్‌ షోలో పాల్గొంటారు.

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ ఉమ్మడిగా పర్యటించే తణుకు, అమలాపురంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు, నిడదవోలు, పి.గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ ప్రాంతాలలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు  తీవ్ర అసంతృప్తితో ఉండటంతో… కూటమి అభ్యర్థులకు కొంతమంది సహకరించడంలేదనే ప్రచారం సాగుతోంది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలో వీరిద్దరూ అసంతృప్త నేతలతో మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. తామిద్దరం కలిసే జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామని.. కేడర్‌ కూడా తమలాగే కలిసి పని చేయాలని పిలుపు నివ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక అమలాపురం, పి.గన్నవరంలో చంద్రబాబు, పవన్‌ గురువారం పర్యటిస్తారు.  ఉభయగోదావరి జిల్లాల నేతలతో ఉదయం 10 గంటలకు చంద్రబాబు సమీక్షిస్తారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలంతా కలిసి పని చేయావలసిన అవసరం గురించి, అసంతృప్తులు, కొందరు నేతల ఒంటెద్దు పోకడలపై  చంద్రబాబు వీరితో  చర్చించనున్నారు. కూటమి అభ్యర్థులంతా ఇప్పుడు పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం గురించి వివరించనున్నారు.  ఆ తర్వాత అంబాజీపేట, అమలాపురంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ పాల్గొంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 15 =