మీరు కూడా ఇందులో భాగం కావొచ్చు!

Whatsapp Number For People's Suggestions On The Manifesto.., Whatsapp Number For People Suggestions, Suggestions On The Manifesto, Manifesto Suggestions, Manifesto, AP NDA, Praja Manifesto, Praja Manifesto As Every One Can Be Part, BJP, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP NDA praja manifesto as every one can be part telugu news

మేనిఫెస్టో ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత కరెంట్‌ అంశం నాడు వైఎస్సార్‌ను ఎవరికి అందనంత ఎత్తులో నిలబెట్టింది. గత ఎన్నికల్లో జగన్‌ నవరత్నాలు సూపర్‌ హిట్ అయ్యాయి. ఇక గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల ప్రమీస్‌తో అధికారంలోకి దూసుకొచ్చింది. గత కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు మేనిఫెస్టోనే అసెట్‌గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. మరోవైపు ఏపీలోని రాజకీయాలపైనా మేనిఫెస్టో అంశం ఈసారి కూడా కీలకంగా మారనుంది. అందుకే ఎన్డీఏ కూటమీ(జనసేన-బీజేపీ-టీడీపీ) ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ప్రజల వద్దకే పాలన అన్నట్టు మేనిఫెస్టోను కూడా ప్రజల సూచనల మేరకే రూపొందించనుంది.

ఫీడ్ బ్యాక్ కోసం:

మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ‘ప్రజా మేనిఫెస్టో’ ను రూపొందించడానికి ఏపీలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) ప్రజాభిప్రాయాన్ని కోరింది. మేనిఫెస్టోపై ప్రజల సలహాలు, ఫీడ్ బ్యాక్ పొందేందుకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 8341130393 టోల్ ఫ్రీ వాట్సప్ నంబర్‌ను ప్రారంభించింది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని…:

ప్రజల ఫీడ్ బ్యాక్ కోసం టోల్ ఫ్రీ వాట్సప్ నంబర్‌ను ప్రారంభించామంటోంది టీడీపీ. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో కమిటీ ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందట. దేశంలో ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదని టీడీపీ చెబుతోంది. మేనిఫెస్టో ముసాయిదా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేస్తుండడం ఇదే తొలిసారి అన్నది టీడీపీ మాట. ఈ విధానంతో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వర్ల రామయ్య రామయ్య చెబుతున్నారు. జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి పౌరుడికి పాలనా ప్రయోజనాలను అందించడమే తమ కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. గత నెలలో ప్రకటించిన సీట్ల పంపకం ఒప్పందం ప్రకారం టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలను బీజేపీకి, 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలను పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు కేటాయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =