టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Chandrababu Inaugurates TDP Party Office, Chandrababu Naidu Political News, Mango News Telugu, TDP New Party Office In Mangalagiri

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 6, శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. రాజధాని ప్రాంతంలో అట్టహాసంగా నిర్మించిన టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో లోకేష్ దంపతులు, టీడీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభ అనంతరం కార్యాలయం ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, చంద్రబాబు పార్టీ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం మూడు బ్లాక్‌లలో మొదటి బ్లాక్‌ నిర్మాణం పూర్తీ చేసుకుని అందుబాటులోకి వచ్చింది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఈ నేపథ్యంలో డిసెంబర్ 5, గురువారం నాడు నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు కార్యాలయంలో పూజలు నిర్వహించారు. శృంగేరీ శార‌దాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వ‌ర్యంలో ముందుగా గ‌ణ‌ప‌తి పూజ, అనంత‌రం సుద‌ర్శ‌న హోమం , గ‌ణ‌ప‌తి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =