తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించనున్న దళపతి విజయ్

Dalapathy Vijay, Tamil Nadu, Dalapathy Vijay to form a new party in Tamil Nadu, Thalapathy Vijay, Vijay Political Entry, Lok Sabha, Tamilnadu, New Political Party, Tamil cinema world, Lok Sabha elections, Tamil Political News, Tamil News, Latest Tamil Updates, Mango News Telugu, Mango News
Thalapathy Vijay, Vijay Political Entry, Tamilnadu, New Political Party

తమిళనాట కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో దళపతి విజయ్. ఓవైపు నటుడిగా అలరిస్తూనే.. మరోవైపు పలు సంక్షేమ కార్యక్రమాల్ని చేపడుతూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. అయితే కొంతకాలంగా విజయ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో విజయ్ కూడా తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు.  2026 నాటికి ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా విజయ్ వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే విజయ్ రాజకీయాల్లోకి రావడం ఆలస్యం అయింది. ఆయన ఎప్పుడో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ తన భార్య, కుమారుడికి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేదట. అందుకే ఇన్నిరోజులు రాజకీయాల్లోకి రాకుండా ఆగారట. అయితే ఇప్పుడు ఏది ఏమయినప్పటికీ తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని విజయ్ డిసైడ్ అయ్యారట. త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించి.. జనాల్లోకి వెళ్లే దిశగా విజయ్ కసరత్తు చేస్తున్నారట.

ఈక్రమంలో విజయ్ అభిమానుల సంఘం విజయ్ మక్కల్ ఇయక్కమ్ చెన్నైలో సమావేశమయింది. సమావేశంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సంఘంలోని సభ్యులు చర్చించారు. అలాగే విజయ్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. విజయ్ అధ్యక్షతన ఏర్పాటయ్యే పార్టీ నియమ నిబంధనలు ఎలా ఉండాలనే దానిపై కూడా వారు చర్చలు జరిపారట. ఈక్రమంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెలాఖరులో విజయ్ పార్టీ ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీని స్ధాపిస్తారా? లేదా ఎన్నికలు ముగిశాక పార్టీని స్థాపిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందే పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తారని అంటున్నాయి. త్వరలోనే విజయ్ తన పొలిటికల్ ఎంట్రీపై అధికారికంగా ప్రకటన చేస్తారని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − ten =