రాజకీయం కంటే రాష్ట్రం మిన్న, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన శుభాకాంక్షలు

Janasena Chief Pawan Kalyan Responds over AP Global Investors Summit which to held at Visakhapatnam,Janasena Chief Pawan Kalyan Responds,Pawan Responds over AP Global Investors Summit,AP Global Investors Summit,Mango News,Mango News Telugu,AP Global Investors Summit 2023,Global Investors Summit Round Table,AP Global Investors Round Table Meeting,Global Investors Summit 2023,Global Investors Summit 2023 Latest News,Global Investors Summit Visakhapatnam,Global Investors Summit Visakhapatnam 2023,Global Investors Summit News and Updates ,Investors Summit 2023

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (ఏపీజీఐఎస్)ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు 25 దేశాలు నుంచి 46 మంది దౌత్యవేత్తలు, 30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్స్, 14 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానుండగా ఎంఓయూలపై సంతకాలతో పాటుగా 15 ఫోకస్ సెక్టార్ సెషన్స్, నాలుగు కంట్రీ సెషన్, ఒక స్పెషల్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ సదస్సుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, వరుస ట్వీట్స్ చేశారు. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అని, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు.

“దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను.ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతో పాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి తన హృదయపూర్వక విన్నపమని పేర్కొంటూ, ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి అని కోరారు. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి అని సూచించారు.

“ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌ కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప..ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండి. ఇక చివరిగా రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 12 =