రుయాలో ఆక్సిజన్ అందక కరోనా పేషంట్స్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం : పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Responds over Tirupati Ruia Hospital Incident,Mango News,Mango News Telugu,Oxygen Shortage​,Oxygen Supply Stops at Tirupati RUIA Hospital,Tirupati RUIA Hospital,oxygen out of Tirupati​ RUIA​ Hospital,Andhra Pradesh,AP News,Tirupati,Tirupati News,Tirupati Ruia Hospital News,Tragedy in Tirupati RUIA Hospital,Tirupati Tragedy,Tragedy In Tirupati,Tirupati Ruia,Ruia Hospital,Tirupati Ruia Hospital,Tragedy In Tirupati Ruia Hospital,Covid-19,Coronvirus,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Live,Pawan Kalyan Latest News,Pawan Kalyan On Tirupati Ruia Hospital Incident,Tirupati Ruia Hospital Incident,Jana Sena Chief Pawan Kalyan Reacts To Tirupati Ruia Hospital Incident,Tirupati RUIA accident,JanaSena Pawan Kalyan Reacts On Tirupati Ruia Incident

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడం మూలంగా 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే వార్త తీవ్ర ఆవేదనను కలిగించింది. ఊపిరి అందించే వాయువుని సక్రమంగా అందించని దుస్థితి నెలకొనడం వల్లే అత్యంత విషాదకరమైన ఈ ఘటన చోటు చేసుకొంది. రాయలసీమ ప్రజల వైద్య అవసరాలకు కేంద్రమైన రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా, వైద్యపరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారు. కర్నూలు, హిందూపురంల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రోగులు ఆక్సిజన్ సరఫరా అందక చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోలేదు. ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదని సంయమనం పాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలి. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి విషాదకర ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలి” అని పవన్ కళ్యాణ్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 5 =