పెరుగుతున్న కరోనా కేసులు, ఆగస్టు 14 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

Andhra Pradesh, AP Coronavirus, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, COVID-19, Lockdown Extends up to August 14th in Tirupati Town, Tirupati Lockdown, Tirupati Lockdown News, Tirupati Lockdown Updates

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా ప్రభావం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో జూలై 21 నుంచి ఆగస్టు 5 వరకు తిరుప‌తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఆంక్ష‌లు విధించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ ‌ను మరికొన్ని రోజులు‌ పొడిగించారు. ఆగస్టు 14 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని తిరుపతి మున్సిపల్‌ కమిషనర్ ప్రకటించారు.

లాక్‌డౌన్ సమయంలో అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులకు మినహా మిగ‌తా అన్ని రకాల షాపులకు ఇప్పటివరకు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇవ్వగా, ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆగస్టు 5 నాటికీ చిత్తూరు జిల్లాలో 13551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 7452 మంది కోలుకోగా, 135 మంది మరణించారు. ప్రస్తుతం 5650 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here