ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్

TDP-JanaSena, TDP, JanaSena, Vijayawada East,TDP and Janasena candidates,TDP Krishna district Candidates , BJP, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Nadendla Manohar, Mango News Telugu, Mango News
TDP-JanaSena, TDP, JanaSena, Vijayawada East,TDP and Janasena candidates,TDP Krishna district Candidates , BJP

ఉమ్మడి కృష్ణా జిల్లాలో  పోటీచేయడానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 10 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో దింపడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ నియోజకవర్గం నుంచి వెనిగండ్ల రాము, గన్నవరం స్థానం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పామర్రు స్థానం నుంచి వర్ల కుమార్ రాజు అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నందిగామ సెగ్మెంట్ నుంచి తంగిరాల సౌమ్య, నూజివీడు నియోజకవర్గం  నుంచి కొలుసు పార్థసారథిని టీడీపీ , జనసేన కూటమి  అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.  విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా.. సెంట్రల్ నుంచి టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మరోసారి పోటీలోకి దిగనున్నారు. ఇక జగ్గయ్యపేట స్థానం నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు టికెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 నెలలు సమయం మాత్రమే ఉండటంతో.. పార్టీలన్నీ ఎన్నికలకు  సంసిద్దమవుతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని..అలాగే ఏప్రిల్ నెలలో ఎన్నికల పోలింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే  ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు దీనిపై  అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటు ఏప్రిల్ 16న ఏపీలో ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకోవడంతో పార్టీలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగా తమతమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత నియోజకవర్గ ఇన్ చార్జ్‌లను మార్చుతూ  అభ్యర్థులను ప్రకటిస్తోంది. దీంతో టీడీపీ, జనసేన కూటమి కూడా అభ్యర్థుల ఖరారుపై దూకుడు పెంచుతోంది. కొన్ని సీట్లలో మినహా  మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ఈ  కూటమి ఖరారు చేసింది.

ఈ మధ్య ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలు ఉండగా.. 12 స్థానాలకు టీడీపీ, జనసేన  అభ్యర్థులను ఫిక్స్ చేశారు. తెనాలి సీటును జనసేనకు కేటాయించగా.. ఈ నియోజకవర్గం నుంచి  జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్, వేమూరు స్థానం నుంచి నక్కా ఆనందబాబు, పొన్నూరు నియోజకవర్గం నుంచి దూళిపాళ్ల నరేంద్ర కుమార్, చిలకలూరిపేట స్థానం నుంచి పత్తిపాటి పుల్లారావు పేర్లు ఖరారయ్యాయి.

అటు పత్తిపాడు నియోజకవర్గం నుంచి బూర్ల రామాంజనేయులు, వినుకొండ స్థానం నుంచి జీవీ ఆంజనేయులు, మాచర్ల స్థానం నుంచి జులకంటి బ్రహ్మరెడ్డి, గురజాల నియోజకవర్గం నుంచి యరపతినేని శ్రీనివాసరావు, బాపట్ల సెగ్మెంట్ నుంచి వేగేశ్న నరేంద్ర శర్మ  ఖరారయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణ, రేపల్లె స్థానం నుంచి అనగాని సత్యప్రసాద్ పేర్లు ఖరారు  చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎంపీ స్థానాలకు కూడా టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. నర్సరావుపేట నియోజకవర్గం ఎంపీ సీటును లావు శ్రీ కృష్ణదేవరాయలు, గుంటూరు  సెగ్మెంట్ నుంచి పేమ్మసాని చంద్రశేఖర్‌కు టికెట్ కేటాయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 18 =