చంద్రబాబు ఇంటికి వైఎస్ షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం

YS Sharmila Meet Chandrababu Naidu,YS Sharmila Meet Chandrababu,YS Sharmila, Chandrababu naidu, AP, YS Rajareddy Marriage,Mango News,Mango News Telugu,YS Sharmila invites for sons wedding,YS Sharmila Crucial Comments,Congress leader YS Sharmila,YS Sharmila Latest News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,YS Sharmila Live Updates
YS Sharmila, Chandrababu naidu, AP, YS Rajareddy Marriage

వైఎస్ షర్మిల కుమారుడు.. వైఎస్ రాజారెడ్డి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు,  అట్లూరి ప్రియను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. జనవరి 18న హైదరాబాద్‌లో వారి ఎంగేజ్మెంట్ జరగనుండగా.. ఫిబ్రవరి 17న వారి వివాహం జరగనుంది. ఇప్పటికే మొదటి ఆహ్వాన పత్రికను కొడుకు కోడలుతో కలిసి షర్మిల తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడు, సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందజేశారు.

అయితే ఇప్పుడు షర్మిల జగన్ ప్రత్యర్థులను కలిసి ఆహ్వానం పలకడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి షర్మిల ఇన్విటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్లారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన షర్మిల.. తన కొడుకు పెళ్లికి హాజరు కావాలని ఆహ్వానం పలికారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చంద్రబాబు నాయుడును షర్మిల కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా క్రిస్మస్ సందర్భంగా షర్మిల.. నారా లోకేష్‌కు స్వీట్లు పంపించారు.

ఇక చంద్రబాబును కలిసి అనంతరం షర్మిల మాట్లాడుతూ.. తన కొడుకు పెళ్లికి రావాలని ఆహ్వానం పలికానని అన్నారు. చంద్రబాబు కూడా పెళ్లికి తప్పకుండా హాజరవుతానని అన్నారన్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన వచ్చిందని.. వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల వెల్లడించారు. తమ మధ్య ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదని చెప్పారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని షర్మిల కోరారు.

రాజకీయాలు తమ ప్రొఫెషన్ కాబట్టి.. ఒకరిని ఒకరు మాటలు అనుకుంటామని షర్మిల చెప్పుకొచ్చారు. తాము కేవలం రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను చంద్రబాబును పెళ్లికి పిలవడానికి మాత్రమే వచ్చానన్న షర్మిల.. తమకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవని షర్మిల చెప్పుకొచ్చారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =