సీఎం జగన్ ను కలిసిన ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ అవార్డు గ్రహీతలు, రిపబ్లిక్‌ డే పరేడ్ లో పాల్గొన్న ఏపీ విద్యార్ధులు

NSS National Awardees, NSS AP Students Met CM YS Jagan at Camp Office,NSS National Awardees Met CM YS Jagan, Mango News, Mango News Telugu,NSS Awardees call on AP CM YS Jagan, cm jagan pressmeet at Camp Office,cm jagan updates,ys jagan,cm jagan,sports careers,AP latest news, NSS AP Students, CM YS Jagan Meeting at Camp Office, National Service Scheme, Chief Minister YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌) జాతీయ అవార్డు గ్రహీతలు మరియు న్యూఢిల్లీలో ఇటీవల రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ ఏపీ విద్యార్ధులు క‌లిశారు. ఈ సందర్భంగా జాతీయ స్ధాయిలో ఏపీ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టిన నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌) విద్యార్ధులను సీఎం వైఎస్ జగన్ ప్ర‌త్యేకంగా అభినందించి, రానున్న రోజుల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. 2019-20, 2020-21 సంవత్సరాలకు గాను ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ అవార్డు గ్రహీతలను సీఎం అభినందించారు.

అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ స్టేట్‌ ఆఫీసర్ డాక్టర్‌ పి.అశోక్‌రెడ్డి ఏపీలో మొత్తం 36 యూనివర్శిటీలలో 2173 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లలో జరుగుతున్న కార్యక్రమాలను సీఎంకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్ధాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ కృషిచేస్తుందని సీఎంకి వివరించగా, రాబోయే రోజుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా రాష్ట్రానికి మరింత ఖ్యాతి వచ్చేలా కృషిచేయాలన్న సూచిస్తూ, సీఎం వైఎస్ జగన్ వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ఈటీఐ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.రామచంద్రరావు, తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nineteen =