నెంబ‌ర్ వ‌న్ రాజ‌కీయం.. పెమ్మ‌సానికే సాధ్యం..

Pemmasani chandrasekhar, chandrababu naidu, Telugudesam Party, AP Elections,tdp-janasena,guntur,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Election updates,andhra pradesh,AP,Mango News Telugu,Mango News
Pemmasani chandrasekhar, chandrababu naidu, telugudesam party, ap elections

డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.. అట్ట‌డ‌గు స్థాయి నుంచి.. అత్యున్న‌త ఎత్తుకు ఎదిగిన ఆరడుగుల బుల్లెట్‌.. హ‌య్య‌ర్ స్ట‌డీస్ కోసం 24 ఏళ్ల కింద‌ట అమెరికా వెళ్లిన‌ప్పుడు.. ఆయ‌న‌కు ఎవ‌రూ గాడ్ ఫాద‌ర్లు లేరు.. అక్క‌డ స‌హాయ‌స‌హ‌కారాలు అందించే వ్య‌వ‌స్థ లేదు.. ఒక ల‌క్ష్యం కోసం ఒంట‌రిగానే అడుగులు వేశారు.. ఎన్ని ఒడిదుడికులు ఎదురైనా వెనుక‌డుగు వేయ‌లేదు.. ‘ ఎలాగైనా ల‌క్ష్యం సాధించాలి.. అది అల్లాట‌ప్పాగా ఉండ‌కూడ‌దు.. నెంబ‌ర్ వ‌న్ స్థాయి అయి ఉండాలి’.. అని పెమ్మ‌సాని మొద‌ట్లోనే సంక‌ల్పించుకున్నార‌ట‌.. ఆయ‌న క‌ష్టం వృథా కాలేదు. అనుకున్న‌ది సాధించారు.. ల‌క్ష్యానికి చేరువ‌య్యారు.. 60 నుంచి 100 ఏళ్ల చ‌రిత్ర ఉన్న కంపెనీల‌ను వెన‌క్కి నెట్టి నెంబ‌ర్ 1 అయ్యారు.. ఎస్‌.. ఇప్పుడు రాజ‌కీయాల్లోనూ నెంబ‌ర్ 1 కావ‌డం త‌థ్య‌మ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.. ఆయ‌న క‌లుపుకోలుత‌నం.. విశ్ర‌మించ‌ని త‌త్వం.. కూట‌మిని ఐక్యంగా న‌డిపిస్తున్న విధానం.. పెమ్మ‌సానిని గెలుపుతీరాల‌కు చేరువు చేస్తున్నాయి.. గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలో ఆయ‌నకు బ్ర‌హ్మాండ‌మైన ఆద‌ర‌ణ పెరిగేందుకు కార‌ణం అవుతున్నాయి.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ-జ‌న‌సేన‌, తాజాగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒక్క‌తాటిపైకి వ‌చ్చాయి. ఎన్నిక‌ల ముంగిట కూట‌ములు క‌ట్ట‌డం రాజ‌కీయాల్లో  సాధార‌ణ‌మే. అయితే.., ఆయా పార్టీల అధినేత‌లు ఒక్క‌టిగా ఉన్న‌ప్ప‌టికీ.. కొన్నిచోట్ల స్థానిక కేడ‌ర్.. ఎవ‌రికి వారే.. య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్రదేశ్‌లో కూడా కొన్ని లోక్‌స‌భ‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. టీడీపీ-జ‌న‌సేన కేడ‌ర్ మ‌ధ్య అంత‌గా స‌ఖ్య‌త ఉండ‌డం లేదు. కానీ.. గుంటూరు లోక్ స‌భ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ ఆ రెండు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఐక్యంగా విప‌క్ష వైసీపీని ఎదుర్కొంటుడ‌డం ఆస‌క్తికరంగా మారింది. అంద‌రినీ ఒక‌తాటిపైకి న‌డిపిస్తున్న ఆ టీమ్‌ లీడ‌ర్‌, టీడీపీ-జ‌న‌సేన కూట‌మి గుంటూరు ఎంపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.

గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలోని కూట‌మి ఐక్య‌త‌.. పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ గెలుపున‌కు బాస‌టగా నిలుస్తుంది అన‌డంలో సందేహం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఏర్ప‌డిన టీడీపీ-జ‌న‌సేన పొత్తు ల‌క్ష్యాల‌ను ఇరుపార్టీల శ్రేణుల‌కూ వివ‌రించ‌డంలో పెమ్మ‌సాని స‌క్సెస్ అయ్యారు. పొత్తు లక్ష్యాలను నెరవేర్చేందుకు నాయకులు, కార్యకర్తలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాజాగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బ‌రిలో నిలిచిన‌ నాదెండ్ల మనోహర్ నిర్వ‌హించిన రోడ్ షోలో పాల్గొన్న పెమ్మ‌సానికి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

అలాగే.. జనసేన, టిడిపి అభ్యర్థుల క్రాస్‌ ఓటింగ్‌పై ముంద‌స్తుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఓటర్లకు క్రాస్‌ ఓటింగ్‌పై అవగాహన క‌ల్పిస్తున్నారు. జ‌న‌సేన అభ్య‌ర్థి ఉన్న‌చోట ఎమ్మెల్యే ఓటు జ‌న‌సేన‌కు, ఎంపీ ఓటు టీడీపీకి ప‌డేలా వ్యూహ ర‌చ‌న చేశారు. అలాగే.. మిగ‌తాచోట్ల కూడా ఉమ్మ‌డిగా ప్ర‌చారం చేసేలా పెమ్మ‌సాని అద్భుత‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ టిడిపి, జనసేన కార్య‌క‌ర్త‌ల‌తో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి, ఐక్యంగా వైసీపీపై పోరాడేలా  శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో కొంద‌రు జ‌న‌సేన నాయ‌కులు, వేలాది మంది కార్య‌క‌ర్త‌లు పెమ్మ‌సానిని నిత్యం క‌లుస్తూ త‌మ మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నారు. ఆయ‌న రూపొందించిన ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లుచేసేందుకు ఓ సైన్యంగా ముందుకు క‌దులుతున్నారు. ఇదంతా ప‌రిశీలిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు నెంబ‌ర్ వ‌న్ రాజ‌కీయం.. పెమ్మ‌సానికే సాధ్యం.. అని కితాబు ఇస్తున్నారు. విప‌క్ష‌పార్టీ వైసీపీ మాత్రం.. కూట‌మి ఐక్య‌త‌కు భంగం క‌లిగించేందుకు నీచ‌రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంది. కానీ, కూట‌మి టీమ్‌కు గుంటూరు లోక్ స‌భ ప‌రిధిలో లీడ‌ర్ గా డాక్ట‌ర్ పెమ్మ‌సాని ఉండ‌డంతో వైసీపీ ఆట‌లు సాగ‌డం లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + thirteen =