అక్టోబర్ 2న రెండు జిల్లాల్లో రహదారుల మరమ్మతుల కార్యక్రమంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan will Participate in Road Repair Programs as part of Sramadanam on October 2nd

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో శ్రమదానం చేయనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు జిల్లాల్లో ఛిద్రమైన రహదారులకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ముందుగా అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. 2018లో పవన్ కళ్యాణ్ ఈ రోడ్డుపైనే పోరాట యాత్రలో భాగంగా కవాతు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే కార్యక్రమానికి హాజరవుతారు. కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి–ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపడతారు.

“రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల గురించి జనసేన పార్టీ సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా ఉద్యమించిన సంగతి విదితమే. నాలుగు వారాలు గడువు ఇచ్చి వాటికి కనీసం మరమ్మతులైనా చేయాలని విజ్ఞప్తి చేసి, ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ రహదారుల విషయంలో అలక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపడతాయి” అని ప్రకటనలో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =