రేపు చంద్ర‌గ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత

Tirumala Srivari Temple Will Be Closed For 11 Hours On November 8Th Due To Lunar Eclipse,Tirumala Srivari Temple,Tirumala Temple Closed,Lunar Eclipse,Mango News,Mango News Telugu,Lunar Eclipse In Tirumala, Tirumala Doors Closed,Tirumala Tirupati,Tirumala Tirupati Devasthanam,Tirumala Latest News And Updates,Tirupati News And Live Updates,Tirpati Lunar Eclipse,Lunar Eclipse,Ttd,Ttd Chairman,Ttd News And Updates,

చంద్ర‌గ్రహణం కారణంగా రేపు (న‌వంబ‌రు 8వ తేదీ, మంగ‌ళ‌వారం) ఉద‌యం 8.30 గంటల నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు 11 గంటల పాటుగా తిరుమలలో శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి వేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అలాగే ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుందని తెలిపారు. చంద్ర‌గ్రహణం కారణంగా శ్రీ‌వాణి, రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. రాత్రి 7.30 గంట‌లకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని, భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =