ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు?

What Is The Strength Of Which Party In Uttarandhra, Strength Of Uttarandhra, Uttarandhra Strength, Which Party Strength In Uttarandhra, Visakha North, Visakha South, TDP Leaders, Uttarandhra , YCP ,TDP, Uttarandhra, TDP Seats, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Visakha North, Visakha South, TDP leaders,Uttarandhra , YCP ,TDP, Uttarandhra, TDP seats

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ గెలుపోటముల లెక్కలు ఎక్కువ అవుతున్నాయి. ఏ జిల్లా ఎవరికి పట్టం కడుతుంది? ఏ ప్రాంతం ఎవరిని అక్కున చేర్చుకుంటుందనే విషయాన్ని  తేల్చడానికి పొలిటికల్ సర్వేలు పోటీ పడుతున్నాయి. ఇటు  ఎలా అయినా రాబోయే ఎన్నికల్లో  టీడీపీ, వైసీపీ నేతలు చాలా చోట్ల ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టేశారు.

ఇటు ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం  పార్టీలలో ఏ పార్టీ బలం ఎంత అనే ప్రశ్న తెరమీదకు వస్తోంది.  ఉత్తరాంధ్రలో ప్రధాన జిల్లా అయిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే  ఇక్కడ టీడీపీకి, వైఎస్పార్సీపీకి విజయావకాశాలు సమానంగానే  ఉన్నట్లే తెలుస్తోంది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట, శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, పాతపట్నంలో వైఎస్సార్సీపీ బలంగా ఉందని సమాచారం అందుతోంది. అలాగే రాజాం,  టెక్కలి, ఆముదాల వలస, పాలకొండ, ఎచ్చెర్లలలో తెలుగు దేశం పార్టీకి  అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో  ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ, తెలుగు దేశం పార్టీలలో ఏ పార్టీ ఎక్కువ కష్టపడితే ఆ పార్టీకే  ఎక్కువ మొత్తం సీట్లు సొంతమయ్యే  ఛాన్స్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైఎస్పార్సీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిచోట్ల తెలుగు తమ్ముళ్లు  అసమ్మతి రాజకీయాల వల్ల విజయనగరంలో సైకిల్  జోరు తగ్గుతుందన్న వాదన వినిపిస్తోంది. అక్కడ దాదాపుగా అన్ని స్థానాలలో కూడా వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. చీపురుపల్లి, పార్వతీపురం, బొబ్బిలి,  సాలూరు, కురుపాం, ఎస్.కోటలలో వైఎస్సార్సీపీకి అనుకూల ఫలితాలు వీస్తుండటంతో టీడీపీ అధినేత ఇక్కడ దృష్టి సారిస్తే కొంత మేర మారే అవకాశాలు కనిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లాలలో  పరిశీలిస్తే విశాఖ నార్త్, విశాఖ సౌత్ లో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి  తిరుగులేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, ఇతర నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల  పోటాపోటీ ఉండనుందని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీతో పోల్చి చూస్తే తెలుగు దేశం పార్టీకే ఎక్కువ సీట్లు  వచ్చే అవకాశాలు ఉన్నట్లు కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =