సూపర్ స్టార్ రజనీకాంత్‌ సింహంలా సింగిల్‌గా వచ్చి వెళ్లారు, కానీ.. ఇక్కడ గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు – నారా లోకేశ్‌

Yuvagalam Padayatra TDP Leader Nara Lokesh Interesting Comments Over Superstar Rajinikanth Issue,Yuvagalam Padayatra TDP Leader Nara Lokesh,TDP Leader Nara Lokesh Interesting Comments,Nara Lokesh Comments Over Superstar Rajinikanth Issue,Mango News,Mango News Telugu,Nara Lokesh Slams YCP Over Comments,Yuva Galam Padayatra,Nara Lokesh Comments Over Rajinikanth,Superstar Rajinikanth Issue,Yuvagalam Padayatra Latest News,Yuvagalam Padayatra Latest Updates,Yuvagalam Padayatra Live News,Kodali Nanis Sensational Comments,AP Ministers Slam Rajinikanth

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ వ్యవహారంపై చెలరేగిన వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడంలేదు. ఆయన ఏపీలో పర్యటించింది ఒక్కరోజే అయినా, పాల్గొన్నది ఒక్క కార్యక్రమమే అయినా దాని ప్రభావం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రజనీకాంత్‌ రాష్ట్రానికి వచ్చి వెళ్లి నాలుగు రోజులవుతున్నప్పటికీ దీనిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రజనీకాంత్ టార్గెట్‌గా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. టీడీపీ నేతలు రజనీకి మద్దతుగా ఎదురుదాడికి దిగుతున్నారు. రజనీకాంత్ అన్న దాంట్లో తప్పేమీ లేదని, ఆయనకు వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

యువగళం పాదయాత్రలో భాగంగా 87వ రోజు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ దీనిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేవలం ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజన్ గురించి మంచిగా మాట్లాడారు. అంతేకాని రాజకీయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, వైసీపీ గురించి అసలే మాట్లాడలేదు. అయినా కూడా రజనీకాంత్ చంద్రబాబు గొప్పతనం గురించి చెప్పడం చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఈ కార్యక్రమం చూసి ఏకంగా టీవీనే పగలగొట్టారట. అయినా రజనీకాంత్ ఎప్పుడో చెప్పారు.. నాన్నా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్‌గా వస్తుందని. ఆయన సింగిల్‌గా వచ్చి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళాక వైసీపీ వాళ్ళు ఇప్పుడు గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. అందుకే వైసీపీ వాళ్ళు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు’ అని లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =