మరో కొత్త గ్రహం ఏర్పడుతుందా.. శాస్త్రవేత్తలు ఏం గుర్తించారు?

Another new planet will be formed What scientists have found,Another new planet will be formed,What scientists have found,new planet will be formed,Mango News,Mango News Telugu,the planets,Another new planet, scientists, Astronomers,SASSN-21QJ,Another planet,Discovery of new planet similar to Earth,The stunning new planets discovered,Another new planet, Another planet, Astronomers, SASSN-21QJ, scientists, the planets,Another new planet News Today,Another new planet Latest News,Another new planet Latest Updates,Another new planet Live News
the planets,Another new planet, scientists, Astronomers,SASSN-21QJ,Another planet,

ఖగోళ శాస్త్రం ఎప్పుడూ మిస్టరీనే. ఎన్ని విషయాలు తెలిసినా మరెన్నో గుట్టులను తనలోనే దాచుకుంటూ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంటుంది. అలాగే  ఇప్పుడొక మిస్టరీని ఖగోళ శాస్త్రవేత్తల ముందు నిలబెట్టింది. ఇప్పుడు దాని అంతు తేల్చే పనిలోనే పడ్డారు సైంటిస్టులు.

రెండు భారీ గ్రహాలు ఢీకొన్నప్పుడు ప్రకాశవంతమైన కాంతి వెలువడిన దృశ్యాన్ని శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారు. ఈ గ్రహాలు రెండూ ఢీకొన్న తర్వాత వెలువడిన శకలాలు మెల్లగా చల్లారి, కొత్త గ్రహంగా ఏర్పడే అవకాశం ఉంటుందా అనేదానిపై పరిశోధనలు చేస్తున్నారు. ఒకవేళ శాస్త్రవేత్తలు అనుకున్నదే నిజమైతే కొత్త ప్రపంచం ఏర్పడటాన్ని ప్రత్యక్షంగా చూసినట్టేనని అంతా భావిస్తున్నారు. దీనిని బట్టి గ్రహాలు ఏర్పడే తీరును మనమంతా  అర్థం చేసుకునే అవకాశం వచ్చినట్లేనని ఆశిస్తున్నారు.

డిసెంబరు 2021లో.. సుదూర నక్షత్ర వ్యవస్థలో సూర్యుడి వంటి ఒక నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు  నిశితంగా పరిశీలించారు. దాదాపు 1,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న దాని పేరు ఏఎస్‌ఏఎస్‌ఎస్‌ఎన్‌-21క్యూజేగా నామకరణం చేశారు. అయితే  ఇప్పుడు ఎస్‌ఏఎస్‌ఎస్‌ఎన్‌-21క్యూజే పేలటానికి సిద్ధంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కొద్ది నెలల నుంచి  దాని నుంచి వెలువడే కాంతి మారుతూ వస్తోంది. అయితే మునుపటి ప్రకాశానికి చేరుకున్న తర్వాత అది పూర్తిగా కనుమరుగయినట్లు ..నాసాకు చెందిన వైస్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ గుర్తించింది.

అయితే ఇలాంటి మసక నక్షత్రాలు కనిపించడం  కొత్తేమీ కాదు. ఇలా జరిగినప్పుడు భూమికి, నక్షత్రానికి మధ్యలోంచి వెళ్లే పదార్థం వల్ల.. ఈ  కాంతి తగ్గినట్టు కనిపిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. ఏఎస్‌ఏఎస్‌ఎస్‌ఎన్‌-21క్యూజే కూడా ఇలాంటిదే అని అంతా  భావించారు. కానీ అది కనుమరుగు కావటానికి ముందు అక్కడి నుంచి వెలువడే పరారుణ కాంతి సుమారు 4% వరకూ పెరగటమే ఇప్పుడు శాస్త్రవేత్తల ఆశ్చర్యానికి కారణమయింది.

శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి కూడా ఒక కారణం ఉంది. నిజానికి  కొన్ని వేల డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతతో కూడిన వస్తువు నుంచే సాధారణంగా ఇలాంటి బలమైన పరారుణ కాంతి వెలువడుతుందని తెలుసు. ఇప్పుడు ఈ విషయాలనే  శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకొని చూస్తే.. రెండు భారీ గ్రహాలు ఢీ కొనడమే ఈ కాంతికి కారణమని తేలింది. దీని ప్రభావంతోనే అసలు గ్రహాల కంటే కూడా వందలాది రెట్ల ఎక్కువ పరిమాణంలో వేడి, ప్రకాశవంత పదార్థం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడి పరారుణ కాంతికి ఇదే కారణంగా అనుకుంటున్నారు.

సాధారణంగా ప్రతి 300 రోజులకు ఒకసారి మాత్రమే వైస్‌ టెలిస్కోప్‌ నక్షత్రాన్ని పరిశీలిస్తుంది. అందువల్లే తొలిదశలో ఈ కాంతిని గుర్తించకపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. మన సౌర వ్యవస్థలో ఇలాంటి భారీ తాకిడి మూలంగానే ఇప్పటి వరకూ.. యురేనస్‌ గ్రహం ఒకవైపునకు వంగటం, బుధుడి అత్యధిక సాంద్రత, చంద్రుడు పుట్టుకు రావటం వంటి పరిణమాలు సంభవించాయని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు అలాంటి గ్రహం ఉందనే భావనతోనే శాస్త్రవేత్తలు దీనికి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు.కాకపోతే ఇప్పుడు గుర్తించిన విస్ఫోటం మూలంగా విస్తరించిన పదార్థం క్రమంగా చల్లబడి.. సంకోచించి కొత్త గ్రహంగా ఏర్పడటానికి లక్షలాది సంవత్సరాలు పడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల కొత్త  గ్రహాలు ఏర్పడే కీలక విధానం దీని ద్వారా తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + two =