ప్రవళిక సూసైడ్.. రాజకీయ నాయకులపై కేసులు

Pravlika suicide Cases against politicians,Pravlika suicide Cases,Cases against politicians,Pravlika against politicians,Mango News,Mango News Telugu,pravalika , pravalika suicide, ashok nagar, telangana politics,Job aspirants suicide in Telangana,Pravallikas Funeral held Under Tight,ashok nagar, pravalika, pravalika suicide, Telangana Politics,Opposition slams KCR government,Pravlika Latest News,Pravlika Latest Updates,Pravlika Live News,Telangana Politics Latest News,Telangana Politics Latest Updates
pravalika , pravalika suicide, ashok nagar, telangana politics

అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రవళిక ఆత్మహత్య ఘటన రాష్ట్రాన్నే కుదిపేసింది. తీవ్ర దుమారం రేపింది. ప్రవళిక ఆత్మహత్యను.. గ్రూప్స్ పరీక్షల రద్దుకు లింక్ చేస్తూ ప్రతిపక్ష నేతలు నానా రాద్దాంతం చేశారు.  ప్రవళిక మరణించిన రోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. వేలాది మంది అశోక్ నగర్‌లో ప్రవళిక హాస్టల్ వద్ద గుమిగూడి తెల్లవార్లూ నిరసన చేపట్టారు. ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారిపోయింది. కొందరు అడ్డుకున్న పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. పలువురు రాజకీయ నేతలు కూడా అక్కడి చేరుకొని.. నిరుద్యోగులను రెచ్చగెట్టోలా ప్రసంగాలు చేశారు. ఆందోళనలు, నిరసనలు చేసేలా ప్రేరేపించారు.

అయితే ప్రవళిక రూమ్‌లో సూసైడ్ నోట్, లవ్ లెటర్, ఆమె వాట్సాప్ చాట్ ఆధారంగా.. ప్రేమ వ్యవహారం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఆమె ప్రియుడు శివరామ్ రాథోడ్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడం మనస్థాపానికి గురై ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు శివరామ్ రాథోడ్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ప్రవళిక చనిపోయిన రోజు కావాలనే కొందరు.. నిరుద్యోగులను ఆందోళనలకు ప్రేరేపించారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారేలా చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్ యాదవ్, ఓయూ విద్యార్థి సంఘాల నేత సురేష్ యాదవ్, భాను ప్రకాష్ కార్పోరేటర్ విజయ రెడ్డితో సహా మొత్తం 13 మందిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారన్న అభియోగాలపై వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + twelve =