కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ 4 శాతం పెంపు, పేదలకు ఉచిత రేషన్ 3 నెలలు పొడిగింపు

Centre Extends The Free Ration Scheme Pradhan Mantri Garib Kalyan Anna Yojana For Next Three Months, Key Decisions Of Central Cabinet, 4 Percent Increase In DA and DR, Central Government Employees, Free Ration Extension Of Poor By 3 Months, Central Cabinet Latest News And Updates, Mango News, Mango News Telugu, Central Government Employee DA Increased, Central Government Employee DR Increased, DR and DA Increased For Central Employees, Central Govt Employees, Central Government, Central Govt Extended Ration To Poor, PM Narendra Modi, Modi Latest News And Live Updates, Pradhan Mantri Garib Kalyan Anna Yojana

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దసరా పండుగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పేదలకు శుభవార్త వినిపించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్ల‌డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత రేషన్ పథకం ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ను మరో మూడు నెలల పాటు పొడిగిస్తునట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించినట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ 4 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. భార‌తీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ 10,000 కోట్లు కేటాయించినట్లు అనురాగ్ ఠాకూర్ వెల్ల‌డించారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే సుమారు 80 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల గోధుమలు, బియ్యం తదితర ఆహారధాన్యాలను ఉచితంగా అందించడానికి, లాక్‌డౌన్‌ సమయంలో ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ పథకాన్ని తొలిసారిగా మార్చి 2020లో ప్రారంభించబడిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ లభించనుంది. కాగా ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ని అందజేస్తుంది. ఇదిలా ఉండగా.. భారతీయ రైల్వేలకు పెద్ద ఊతమివ్వడం కోసమని న్యూ ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు ముంబై మూడు ప్రధాన రైల్వే స్టేషన్‌లను తిరిగి అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ. 10,000 కోట్ల పెట్టుబడి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 8 =