చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

China President Arrives In Chennai, China President Xi Arrives In Chennai, China President Xi Jinping Arrives In Chennai, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, Xi Jinping Arrives In Chennai

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కొద్దిసేపటి క్రితమే చెన్నై చేరుకున్నారు. చెన్నై విమాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఎయిర్ పోర్ట్ లో జిన్‌పింగ్‌ కు ఘనంగా స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభాన్ని సమర్పించారు. జిన్‌పింగ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌ కు వెళ్లారు, అక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు.

జిన్‌పింగ్‌ భారత పర్యటన:
  • ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన మహాబలిపురం బయలుదేరుతారు
  • దారిపొడవునా విద్యార్థులు, వివిధ రకాల కళాకారుల బృందాలు ఆయనకు స్వాగతం పలుకుతారు
  • మహాబలిపురంలో జిన్‌పింగ్‌ కు భారత ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలుకుతారు
  • అనంతరం ఇరు దేశాధినేతలు అక్కడే ఉన్న పలు చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలు సందర్శించనున్నారు
  • అనంతరం షోర్ టెంపుల్ వద్ద జిన్‌పింగ్‌, ప్రధాని నరేంద్రమోదీ చర్చలు జరపనున్నారు
  • తరువాత అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు హాజరవుతారు, ఈ సందర్భంగా నిర్వహించే విందు కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు
  • ఇక శనివారం నాడు ఫిషర్ మెన్ కొవ్ రిసార్ట్ లో జిన్‌పింగ్‌, ప్రధాని నరేంద్రమోదీ ముందు వ్యక్తిగతంగా చర్చలు జరిపి, అనంతరం ఇరు దేశాల అధికార ప్రతినిధులతో కలిసి చర్చలు జరుపుతారు, ఈ భేటీలో ద్వైపాక్షిక, అంతర్జాతీయ, ప్రాంతీయ, వాణిజ్య సంబంధాలు, భౌగోళిక అంశాలు చర్చకు రానున్నాయి.
  • శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు జిన్‌పింగ్‌ తిరిగి చెన్నై చేరుకుని, అక్కడ నుంచి నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చెన్నై పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here