కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అరెస్ట్

Chidambaram arrested In INX Media Case, Chidambaram INX Media Case, Chidambaram INX Media Case Live Updates, Congress Leader P Chidambaram INX Media Case, Congress Leader P Chidambaram INX Media Case Live Updates, Congress Senior Leader P Chidambaram arrested, Congress Senior Leader P Chidambaram arrested In INX Media Case, ED issues lookout notice to Chidambaram, Enforcement Directorate, Former Finance Minister of India, INX Media case Live, Mango News

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లగా, పిటిషన్ పై తక్షణ విచారణ చేయడానికి కోర్టు నిరాకరించడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంగళవారం నుంచి అజ్ఞాతంలో ఉన్న చిదంబరాన్ని పట్టుకునేందుకు సీబీఐ, ఈడీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అకస్మాత్తుగా బుధవారం రాత్రి ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమై మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని, అసలు ఈ కేసులో తాను నిందితుడిని కాదని మీడియాకు తన వివరణ అందించారు.

మీడియా సమావేశం అనంతరం జోర్ భాఘ్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. చిదంబరం వెంట అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ ఉన్నారు. కాసేపటికే అక్కడికి సీబీఐ,ఈడీ అధికారులు చేరుకోని హైడ్రామాను తలపించే ఉత్కంఠ భరితమైన మలుపుమధ్య ఢిల్లీ పోలీసులు సహాయంతో చిదంబరాన్ని అరెస్ట్ చేసారు. కోర్టు వారెంట్ మేరకు అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రకటించింది. చిదంబరాన్ని బుధవారం రాత్రి మొత్తం సీబీఐ అతిధి గృహంలో ఉంచారు. ఈ ఉదయం సీబీఐ ప్రధానకార్యాలయంలో చిదంబరాన్ని అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తరువాత వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో హాజరు పరచనున్నారు. కోర్టులో విచారణ అనంతరం చిదంబరాన్ని రిమాండ్ కు ఇవ్వాలని సీబీఐ కోరే అవకాశం ఉంది.

 

[subscribe]
[youtube_video videoid=ENbzcdzzNcU]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 13 =