పెరుగుతున్న కరోనా కేసులు, సెప్టెంబర్ 6 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

Bihar, Bihar extends lockdown due to coronavirus, Bihar Lockdown, bihar lockdown extended, Bihar Lockdown News, Complete Covid-19 lockdown in Bihar, Covid-19 lockdown extended in Bihar, Lockdown Extended In Bihar upto September 6 th

రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో లాక్‌డౌన్ విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా బీహార్‌లో ముందుగా జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు లాక్‌డౌన్ అమలు చేశారు. కాగా ఈ రోజు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి లాక్‌డౌన్ పొడిగింపుకే మొగ్గుచూపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ రాష్ట్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

లాక్‌డౌన్ సమయంలో విద్యాసంస్థలు, మాల్స్ మరియు మతపరమైన ప్రదేశాలు మూసివేయబడతాయని పేరొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయనున్నాయి. మరోవైపు బీహార్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,618 కి చేరుకుంది. వీరిలో 76706 మంది కరోనా నుంచి కోలుకోగా, 542 మంది మరణించారు. ప్రస్తుతం బీహార్ లో 29369 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 18 =