ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ రెండో చార్జిషీట్.. సీఎం కేజ్రీవాల్‌, ఏపీ ఎంపీ మాగుంట సహా ఐదుగురు పేర్లు

Delhi Liquor Scam ED Files Second Chargesheet Against 5 People Along with CM Arvind Kejriwal,CM Arvind Kejriwal,Tweet on Delhi Liquor Scam,K Kavitha Meets KCR,K Kavitha CBI Interrogation,K Kavitha,Mango News,CBI Response on K Kavitha,CBI Alternate Dates Suggestion,CBI on K Kavitha,Mango News,Delhi Liquor Scam, Cbi First Chargesheet,7 Names Delhi Liquor Scam, Deputy Cm Manish Sisodia Exempted,Delhi Liquor Scam Case,Delhi Liquor Scam Chargesheet,Delhi Liquor Scam Explained,Delhi Liquor Scam Latest News,Liquor Scam Delhi,Liquor Scam Cbi,Liquor Scam News,Liquor Scam Arrest,Liquor Scam Update,Delhi Liquor Case,Telangana Mlc Kalavakuntla Kavitha

ఢిల్లీ మద్యం కుంభకోణంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. ఇక ఈ ఛార్జ్‌షీటులో పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం సంచలనం రేపుతోంది. వీరిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరుల పేర్లున్నాయి. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో అందిన ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గోవా ఎన్నికల్లో ఉపయోగించిందని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కుంభకోణంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి హవాలా మార్గంలో ఆప్ పార్టీలోని కొందరు నేతలకు ముడుపులు అందినట్లు స్పష్టం చేసింది.

కాగా ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్‌లో ఈడీ తెలిపింది. అలాగే కవిత అనుచరుడు వి. శ్రీనివాసరావును విచారించినట్లు వెల్లడించిన ఈడీ ఆయన వాంగ్మూలాన్ని ఛార్జ్‌షీటులో ప్రస్తావించింది. వ్యాపారవేత్త అరుణ్ పిళ్ళైకి శ్రీనివాసరావు రూ. కోటి ఇచ్చారని, ఇది కవిత ఆదేశాలతోనే జరిగిందని స్ఫష్టం చేసింది. ఇంతకుముందు కూడా ఈడీ ఈ కేసులో ఆధారాలను ధ్వసం చేసిన వారిలో కవిత పేరును ప్రస్తావించడం తెలిసిందే. ఇక ఈ కేసులో ఇప్పటికే మొత్తం 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది. ఇంకా పలువురి ఆస్తులను అటాచ్ చేసింది. వ్యాపారవేత్తలు సమీర్‌ మహేంద్రు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌ ఇళ్లను, దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here