ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు

DGCA, DGCA Announces that International Flights Remain Suspended, DGCA extends suspension of international flights, Directorate General of Civil Aviation, International Flights, International Flights Remain Suspended, International Flights Remain Suspended Till August 31

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసుల పై ఇప్పటికే రద్దు కొనసాగుతుండగా, మరోసారి రద్దు గడువును పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 అర్ధరాత్రి 23.59 గంటల వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు, డీజీసీఏ అనుమతించే స్పెషల్ విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు.

మరోవైపు ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో ఒప్పందాలను చేసుకుని కొన్ని ప్రయాణికుల విమానాలను నడుపుతున్నారు. ఇందులో భాగంగా దశల వారీగా కెనడా, ఖతార్, ఒమన్, యుఎఇ, సింగపూర్, ఫ్రాంక్‌ఫర్ట్, పారిస్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలకు కూడా విమానాలు నడపబడతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =