రాష్ట్రపతి హోదాలో తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము

Draupadi Murmu Addressed The Nation For First Time as President After Taking Oath, Murmu Addressed The Nation For First Time as President, Draupadi Murmu Addressed The Nation, President Draupadi Murmu, President of India, Droupadi Murmu 15th President of India, Droupadi Murmu Takes Oath as 15th President of India, Droupadi Murmu Takes Oath As India's 15th President, Droupadi Murmu takes oath, Murmu to take oath of office of the President, Droupadi Murmu Swearing, Droupadi Murmu sworn in as India's 15th President of India, Droupadi Murmu, Droupadi Murmu Speech News, Droupadi Murmu Speech Latest News, Droupadi Murmu Speech Latest Updates, Droupadi Murmu Speech Live Updates, Mango News, Mango News Telugu,

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు (జూలై 25, సోమవారం) పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ము చేత ప్రమాణం చేయించారు. తద్వారా రాష్ట్రపతితో ప్రమాణం చేయించిన తొలి తెలుగు సీజేఐగా ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, స్పీకర్‌ ఓంబిర్లా, పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, గవర్నర్లు, సీఎంలు, త్రివిధ దళాల అధికారులు హాజరయ్యారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం అనంతరం సైన్యం 21 గన్ సెల్యూట్ తో ఆమెకు గౌరవ వందనం సమర్పించింది. సైనిక వందనం తర్వాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. భారతదేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా తనను ఎన్నుకున్నందుకు దేశంలోని అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన దేశానికి మొదటి రాష్ట్రపతిని నేనే కావడం ఆనందంగా ఉందని, దేశంలో పేదలు తమ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని, అందుకే తానే ఒక మంచి ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. తాను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చానని, తమ గ్రామంలో ఆ రోజుల్లో ఆడపిల్లలు స్కూల్‌కు వెళ్లడం ఎంతో పెద్ద విషయమని తెలిపారు. ఇక ఆ ఊరిలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలిక తానేనని ముర్ము గర్వంగా ప్రకటించారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. మీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం.. రాష్ట్రపతిగా బాధ్యతలు ఉన్నతంగా నిర్వర్తించడానికి నన్ను నడిపించేలా ప్రోత్సహిస్తాయని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున ఈ సందర్భంలో రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల లక్ష్యాల కోసం మనమందరం కృషి చేయాలని, మన స్వాతంత్య్ర సమరయోధులు ఆశించిన అంచనాలను అందుకోవడానికి మన ప్రయత్నాలను వేగవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే దేశ రక్షణ దళాలకు, పౌరులందరికీ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. కాగా రాష్ట్రపతి పదవి చేపట్టిన భారత తొలి ఆదివాసిగా రికార్డ్ సృష్టించిన ముర్ము, దేశ రెండవ మహిళా రాష్ట్రపతిగానూ నిలిచారు. అలాగే స్వతంత్ర భారతదేశంలో పుట్టిన మొట్టమొదటి రాష్ట్రపతి కూడా ముర్ముయే కావడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =