ఆస్కార్ వేడుకల్లో పాల్గొనకుండా నటుడు విల్‌స్మిత్‌పై 10 ఏళ్ల నిషేధం విధించిన అకాడ‌మీ

Hollywood Actor Will Smith Banned by Academy From Oscars for 10 Years, Will Smith Banned by Academy From Oscars for 10 Years, Hollywood Actor Will Smith Banned by Academy From Oscars, Hollywood Actor Will Smith banned by Academy from Oscars for 10 years after slapping Chris Rock, Hollywood Actor Will Smith banned from attending Oscars for 10 years after slap, Actor Will Smith banned from attending Oscars for 10 years, Hollywood's film academy banned Will Smith from attending the Oscars for 10 years, Will Smith banned from Oscars for 10 years, Smith shall not be permitted to attend any Academy events, Oscar Academy Bans Will Smith From Oscars for 10 Years, Will Smith banned from attending Oscars for 10 years after slapping Chris Rock, Will Smith Banned For 10 Years From The Oscars, Oscars Academy, Hollywood's film academy, Hollywood's film academy Latest News, Hollywood's film academy Latest Updates, Hollywood's film academy Live Updates, Mango News, Mango News Telugu,

94వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత విల్ స్మిత్, ప్రముఖ వ్యాఖ్యాత, కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ మధ్య జరిగిన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్కార్‌లతో సహా ఇతర అన్ని అకాడమీ ఈవెంట్‌లలో 10 సంవత్సరాల పాటు నటుడు విల్ స్మిత్ పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. టెలికాస్ట్ సమయంలో అక్కడ పరిస్థితిని తగినంతగా పరిష్కరించలేదని, అందుకు క్షమించాలని అకాడమీ కోరింది.

విల్ స్మిత్ రాజీనామాను ఆమోదించడంతో పాటుగా ఆస్కార్ వేడుకలో అతని చర్యలకు ఏం చేయాలో చర్చించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, విల్ స్మిత్ చర్యలపై విచారణ అనంతరం ఏప్రిల్ 8, 2022 నుండి 10 సంవత్సరాల కాలానికి అతను ఎలాంటి అకాడమీ ఈవెంట్స్ కు హాజరు కాకుండా నిషేదించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో కూడా ప్రశాంతతను కొనసాగించిన క్రిస్ రాక్‌కి అకాడమీ కృతజ్ఞతలు తెలిపింది. ఇక విల్ స్మిత్ ఆస్కార్‌లకు నామినేట్ చేయబడడం, గెలువవచ్చుగాని, అతన్ని ఆయా ఈవెంట్స్ కు హాజరుకాకుండా నిషేదించారు. మరోవైపు ఈ నిర్ణయంపై విల్ స్మిత్ స్పందిస్తూ అకాడమీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని మరియు గౌరవిస్తానని పేర్కొన్నాడు.

ముందుగా 94వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ ను నటుడు విల్‌ స్మిత్‌ చెంప దెబ్బ కొట్టాడు. అవార్డ్స్ ప్రకటన సందర్భంగా జుట్టు లేకుండా గుండుతో ఈ షోకి హాజరైన విల్‌ స్మిత్‌ వైఫ్ జాడా పింకెట్‌ స్మిత్ ప్రస్తావన తెస్తూ క్రిస్‌ రాక్‌ ఒక జోక్ చెప్పారు. అలోపేసియా అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలోనే జుట్టులేకుండా గుండుతో ఉంటున్నట్టు జాడా పింకెట్‌ గతంలో ప్రకటించారు. క్రిస్‌ రాక్‌ జోక్ పై ఆగ్రహానికి గురైన విల్ స్మిత్ ఒక్కసారిగా లేచి వేదికపైకి వెళ్లి ఆయన్ను చెంపై కొట్టారు. వేదిక నుంచి వచ్చాక కూడా తన భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దని క్రిస్‌ రాక్‌ ను విల్ స్మిత్ హెచ్చరించారు. ఈ ఘటనతో డాల్బీ థియేటర్‌లో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా కింగ్‌ రిచర్డ్‌ సినిమాకు ఉత్తమ నటుడిగా ఎంపికై అవార్డు అందుకునేందుకు వేదికపై వచ్చిన విల్‌ స్మిత్‌ ముందు జరిగిన ఘటన పట్ల క్షమాపణలు చెప్పారు. “నేను అకాడమీకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. నా తోటి నామినీలందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను” అని విల్ స్మిత్ పేర్కొన్నారు. అనంతరం క్రిస్ రాక్ కు కూడా విల్ స్మిత్ క్షమాపణలు చెప్పి, అకాడమీకి రాజీనామా చేస్తునట్టు ప్రకటించాడు. తాజాగా అకాడమీ విల్ స్మిత్ పై చర్యలు తీసుకుంటూ నిర్ణయాన్ని ప్రకటించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =