ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌: 15 మందితో యూఎస్ఏ టీమ్ ప్రకటన

ICC U19 Women's T20 World Cup USA Cricket Announces 15-Player Squad,ICC U19 Women's T20 World Cup,USA Cricket Announces Player,USA Cricket 15-Player Squad,Mango News,Mango News Telugu,Geetika Kodali (Captain),Anika Kolan (WK) (Vice Captain,Aditi Chudasama,Bhumika Bhadriraju,Disha Dhingra,Isani Vaghela,Jivana Aras,Laasya Mullapudi,Pooja Ganesh (WK),Pooja Shah,Ritu Singh,Sai Tanmayi Eyyunni,Snigdha Paul,Suhani Thadani,Taranum Chopra,Women World Cup,Usa Under 19 Womens Cricket Team,Usa Cricket Team Players

ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ యొక్క తొలి ఎడిషన్ 2023, జనవరి 14వ తేదీ నుండి 29వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా 11 ఐసీసీ పూర్తి-సభ్య దేశాలు (ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే) ఆటోమేటిక్ ఎంట్రీ పొందగా, మిగిలిన ఐదు స్థానాలను ఐసీసీ యొక్క ఐదు ప్రాంతాల నుండి ఒక్కో జట్టు (యూఎస్ఏ, ర్వాండా, యూఏఈ, స్కాట్లాండ్, ఇండోనేసియా) భర్తీ చేశాయి. ఈ నేపథ్యంలో అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ కోసం పలు దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించగా, తాజాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) క్రికెట్ బోర్డు కూడా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. అమెరికా నుంచి తొలిసారి మహిళ జట్టు ప్రపంచ కప్ బరిలోకి దిగుతుంది.

“వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రాతినిధ్యం వహించే 15 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించడం గౌరవంగా ఉంది. ఈ జట్టుకు గీతిక కొడాలి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కోచింగ్ టీమ్‌కు వెస్టిండీస్ మాజీ బ్యాటర్ శివనారాయణ్ చంద్రపాల్ నాయకత్వం వహిస్తున్నారు. యూఎస్ఏ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక జట్లతో పాటుగా గ్రూప్-ఏలో ఉంది” అని యూఎస్ఏ క్రికెట్ బోర్డు పేర్కొంది. 15 మందితో కూడిన జట్టుతో పాటుగా ఐదు నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు ఉన్నారని, వారు ఏవైనా ప్రత్యామ్నాయాలు అవసరమైతే స్టాండ్-బైలో ఉంటారని తెలిపారు. కాగా అమెరికా అండర్-19 మహిళల జట్టులో అందరూ భారత్ మూలాలున్నా వారే ఉండడం విశేషం.

మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా ఉండగా, ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ రౌండ్‌ కు చేరుకుంటాయి, అక్కడ ఆరు జట్లతో రెండు గ్రూపులుగా పూల్ చేయబడతాయి. అనంతరం ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి. ఇక జనవరి 27న పోచెఫ్‌స్ట్రూమ్‌లోని జేబీమార్క్స్ ఓవల్‌లో సెమీఫైనల్స్ జరుగనుండగా, జనవరి 29న ఇదే వేదికపై అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ కూడా జరగనుంది.

అమెరికా అండర్-19 మహిళల జట్టు:

  1. గీతిక కొడాలి (కెప్టెన్)
  2. అనికా కోలన్ (వికెట్ కీపర్) (వైస్ కెప్టెన్)
  3. అదితి చూడసమా
  4. భూమిక భద్రిరాజు
  5. దిశా ధింగ్రా
  6. ఇసాని వాఘేలా
  7. జీవన అరస్
  8. లాస్య ముళ్లపూడి
  9. పూజా గణేష్ (వికెట్ కీపర్)
  10. పూజా షా
  11. రీతూ సింగ్
  12. సాయి తన్మయి ఎయ్యుణ్ణి
  13. స్నిగ్ధా పాల్
  14. సుహాని తడాని
  15. తరణం చోప్రా.

రిజర్వ్స్:

  1. చేతన ప్రసాద్
  2. కస్తూరి వేదాంతం
  3. లిసా రామ్‌జిత్
  4. మిటాలి పట్వర్ధన్
  5. త్యా గొన్సాల్వేస్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 11 =