జరీమానా, జైలు శిక్షలో తేడా ఉంటుందా?

Drinking on a Dry Day, Fine, Imprisonment, Drunk and Drive, If caught drinking on a dry day, fine and imprisonment?, Jail, Alcohol, Public Drinking, Public News, Drivinf Lisence, Public Places, Drunk driving law, Mango News Telugu, Mango News,
If caught drinking on a dry day, fine and imprisonment?, Drunk and Drive

జాతీయ పండుగలు, మతపరమైన పండుగలు, గొప్ప వ్యక్తుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రై డేని నిర్వహిస్తారు. అలాగే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా డ్రై డేగా ప్రకటిస్తారు. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికలకు, పోలింగ్ ముగియడానికి , ఓట్ల లెక్కింపు రోజుకు 48 గంటల ముందు డ్రై డేగా ప్రకటిస్తారు  స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే  వంటి జాతీయ సెలవు దినాలలో కూడా మద్యం నిషేధం అమలు ఉంటుంది. ఉంది. డ్రై డే రోజు మద్యం దుకాణాలు తెరవడానికి నిషేధం ఉంటుంది. వైన్ షాపులతో పాటు బార్‌లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరాపై కూడా  నిషేధం ఉంటుంది.

మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్న డ్రై డే రోజున ఎవరైనా మందు తాగి  వాహనం నడుపుతూ పట్టుబడితే.. మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 185 ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారు. పట్టుబడినప్పుడు ఒక వ్యక్తి యొక్క 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్నట్లు తెలిస్తే.. చట్టం ప్రకారం నేరస్థుడికి జరీమానా, జైలు శిక్ష లేదంటే రెండు శిక్షలు కూడా విధించవచ్చు. మొదటి సారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10,000 వరకు జరీమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. అదే సమయంలో రెండోసారి పట్టుబడితే రూ. 15,000 జరీమానా, రెండేళ్ల వరకు జైలు శిక్షను విధించవచ్చు.  మూడోసారి పట్టుబడితే మాత్రం ఈ రెండు శిక్షలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు.

డ్రై డేలో మీ వెహికల్‌లో కూడా మద్యం తీసుకెళ్లకూడదు. సాధారణ సమయాల్లో కూడా ఏదైనా రాష్ట్రంలో మద్య నిషేధం ఉంటే.. మరొక రాష్ట్రం నుండి మద్యాన్ని తీసుకువస్తే.. చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ సందర్భంలో.. దోషికి కనీసం రూ. 5,000 జరీమానా, 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రెండింటిలో ఏ  శిక్షను అయినా విధించవచ్చు. మద్యనిషేధం అమలు లేని రాష్ట్రాల్లో,  2 లీటర్ల మద్యాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

ఒక వ్యక్తి డ్రై డేలో మద్యం సేవించి కాలినడకన లేదా పబ్లిక్ వెహికల్లో బయటకు వెళ్లాడని అనుకుందాం. అతని ప్రవర్తన డీసెంట్‌గా ఉంటే ఓకే కానీ, లేకపోతే మాత్రం అంటే అతని వల్ల పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కొంటే సాధారణ రోజులలాగే  అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ  డ్రై డే కోసం ప్రత్యేక చట్టం లేదు. డ్రై డే రోజున డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే సాధారణ రోజుల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయో అవే ఆసమయంలో దొరికిన వారిపై కూడా ఉంటాయి. కాకపోతే డ్రై డే రోజున మందు అమ్మకాలు, కొనుగోలుపై కఠిన నిషేధాన్ని అమలు చేస్తారు.

భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని  ఒక అంశంగా రాష్ట్ర జాబితాలో మద్యం గురించి ఉంటుంది. దీనివల్ల, మద్యాన్ని నియంత్రించే చట్టాలు ఒక రాష్ట్రానికి, ఇంకో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి.  సాధారణంగా మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లు, పబ్బులు, క్లబ్‌లు మరియు డిస్కోలలో మద్యాన్ని విక్రయిస్తారు. కొన్ని పర్యాటక ప్రాంతాలు బీచ్‌లు , హౌస్‌బోట్‌లలో మద్యం అమ్మకాలను అనుమతించడానికి ప్రత్యేక చట్టాలను కలిగి ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =