నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. సిరీస్‌లో నిలవాలంటే టీమిండియా గెలవాల్సిందే

Ind vs NZ 2nd T20 Team India Aims To Keep Series Alive Against New Zealand in Today's Match,India Vs New Zealand Tickets,India Vs New Zealand World Cup 2023,India Vs New Zealand 2023 T20,Mango News,Mango News Telugu,India Vs New Zealand Schedule,India Vs New Zealand T20,India Vs New Zealand Test,India Vs New Zealand Hyderabad Tickets,India Vs New Zealand Upcoming Match,India Vs New Zealand Live,India Vs New Zealand Live Score,India Vs New Zealand 2023,India Vs New Zealand Wtc Final,India Vs New Zealand Live Score 2023,India Vs New Zealand 2Nd Test 2023,India Vs New Zealand Test 2023,India Vs New Zealand Highlights,India A Vs New Zealand A Live Score Today,India Legends Vs New Zealand Legends,Indian Vs New Zealand,India A Vs New Zealand A Today Match

న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20 ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్‌ సిరీస్‌లో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. మరోవైపు ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న న్యూజిలాండ్‌ అదే ఊపును కొనసాగిస్తూ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. దీంతో నేటి మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. ఇక రాంచీలో జరిగిన తొలి టీ20లో హార్దిక్‌ పాండ్యా సారధ్యంలోని టీమిండియా ముఖ్యంగా బౌలర్లు, టాపార్డర్‌ వైఫల్యంతో పరాజయం పాలైంది. యువ పేసర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్ లో తేలిపోయారు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 51 పరుగులు ఇవ్వడం జట్టును ఆందోళనలో పడేసింది. దీంతో అర్ష్‌దీప్ స్థానంలో ముఖేష్‌ కుమార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాణించడం కొంత ఊరట కలిగించే విషయం.

అలాగే ముగ్గురు టాపార్డర్‌ బ్యాటర్లు 15 పరుగులకే పెవిలియన్‌ చేరడం కూడా జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. శుభ్‌మన్ గిల్‌, కిషన్‌, దీపక్‌ హుడాలు స్వల్ప స్కోర్లకే పరిమితమవడంతో మిడిలార్డర్ పైన తీవ్ర ఒత్తిడి పడింది. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ రాణించినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతగా ప్రభావం చూపించలేకపోయారు. ఇక రాహుల్ త్రిపాఠి స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వొచ్చు. మరోవైపు శాంట్నర్‌ నేతృత్వంలోని కివీస్ తొలి మ్యాచ్ విజయంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు ప్రధానంగా కాన్వే, మిచెల్‌పై ఆశలు పెట్టుకుంది. కాగా నేటి మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరుగనుంది.

జట్లు (అంచనా)

భారత జట్టు: ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి/పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ మావి, కుల్దీప్‌ యాదవ్, ఉమ్రాన్‌ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్‌/ముఖేష్‌ కుమార్‌.

న్యూజిలాండ్‌ జట్టు: ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, మార్క్ చాప్‌మన్‌, డారిల్‌ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్‌, మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), మైకేల్‌ బ్రేస్‌వెల్‌, జాకబ్ డఫీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్‌, బ్లెయిర్ టిక్నర్‌.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =