ఉప్పు ఎక్కువగా తింటే మెదడుకు ఇంత డ్యామేజ్ జరుగుతుందా?

Does Eating Too Much Salt Damage The Brain,Eating Too Much Salt,Salt Damage The Brain,Brain Damage,Salt Damages Brain,Mango News,Mango News Telugu,Surprising findings on how salt affects,What too much salt can do,High salt diet triggers changes,Health Effects,How salt affects blood flow,Brain on Salt,High BP and low BP,Eating too much salt damage the brain,Does eating too much salt,Eating Too Much Salt News Today,Eating Too Much Salt Latest News,Salt Damage The Brain Latest News,Salt Damage The Brain Latest Updates

ఇప్పుడు ఎవరిని అడిగినా.. అయితే ‘హై బీపీ’ లేదంటే ‘లో బీపీ’ (High BP and low BP) సమస్యతో బాధపడుతున్నామని చెబుతున్నవాళ్లే కనిపిస్తున్నారు. నిజానికి బీపీకి ముఖ్యమైన కారణంగా చెప్పే ఉప్పు (salt) గురించే ఇప్పుడు చెప్పుకోవాలి. నిజానికి ఉప్పు తక్కువగా తీసుకున్నా అనర్థమే, ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల.. రక్తపోటు పెరుగుతుంది. అంతేకాదు గుండెజబ్బులు, పక్షవాతం కూడా రావచ్చని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే ఉప్పు ఎక్కువగా వాడితే అది.. మెదడును కూడా ప్రభావితం చేస్తుందన్న విషయం తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు డెమెన్షియా అనే మతిమరుపు వ్యాధి (amnesia)తో ఇబ్బందులు పడుతున్నారు. దాని వెనుక కూడా ఉప్పు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు అధ్యయనకర్తలు. అందుకే ఉప్పుని తగ్గిస్తే చాలా దీర్ఘకాల వ్యాధులను బయటపడొచ్చని తెలిపింది. న్యూయార్క్‌కు చెందిన ‘ఫీల్ ఫ్యామిలీ బ్రెయిన్ అండ్ రీసెర్చ్ ఇన్సిట్యూట్’ (Feil Family Brain and Research Institute) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

చాలా మంది కూరల్లో, బిర్యానీ వంటి వంటకాల్లో.. ఉప్పు ఎక్కువగా వేసుకుని తింటుంటారు. ఇలాంటివారు ఆరోగ్యం కంటే కూడా టేస్ట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అయితే ఉప్పును ఎక్కువగా వాడుతున్నప్పుడు, ఆ సాల్టుని చిన్న పేగులు శోషణం చేసుకుంటాయట. దీంతో టీహెచ్ 17 అని పిలిచే తెల్లరక్తకణాలు (White blood cells) ఎక్కువగా ఉత్పత్తి అవుతాయట. దీని వల్ల ఐఎస్17 అనబడే ప్రోటీన్ స్థాయిలు (Protein levels) ఒకేసారి పెరిగిపోతాయి. ఈ పరిణామం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా తగ్గిపోతుందట. దీంతో రక్తనాళాలు బిగుసుకుపోవడం మొదలవుతుంది. ఇలా ఎప్పుడైతే రక్తనాళాలు బిగుసుకుపోతాయో.. అప్పుడు రక్తం సరఫరాకి ఆటంకం కలుగుతుంది. దీనివల్ల మెదడుకు కూడా రక్తం తక్కువగా అందుతుంది.

దీనివల్ల మనిషి ఆలోచనా విధానంపైనా, జ్ఞాపకశక్తిపై ప్రభావం (Effect on memory) పడుతుంది. అంటే త్వరగా అన్ని విషయాలను మర్చిపోవడం, సరిగ్గా ఆలోచించ లేకపోవడం, ఏదైనా విషయాలను విశదీకరించలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇదంతా కేవలం మూడు నెలల పాటు ఉప్పు ఎక్కువగా ఇచ్చి.. వారి మీద పరిశోధన చేస్తేనే.. ఇలాంటి భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. మరి ఇన్ని రోజులు కాస్త ఉప్పు తక్కువైనా కాంప్రమైజ్ కాని వాళ్లపై అధ్యయనం చేస్తే ఇంకా ఎలాంటి డేంజర్ విషయాలు తెలిసేవోనని అధ్యయన కర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమయినా హై బీపీ , లో బీపీ (High BP and low BP) ఉన్నవాళ్లు డాక్టర్ చెప్పినట్లే ఉప్పు తీసుకోవాలి కాబట్టి.. నార్మల్‌గా ఉన్నవాళ్లంతా కాస్త సాల్ట్ తగ్గించి తింటేనే మంచిదని సూచిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =