75 రూపాయల నాణాన్ని విడుదల చేసిన పీఎం మోదీ

On FAO 75th anniversary, PM Modi, PM Modi releases commemorative coin, PM Modi Releases Commemorative Coin of Rs 75, PM Modi Releases Commemorative Coin of Rs 75 Denomination, PM Modi releases Rs 75 coin, PM Narendra Modi releases Rs 75 coin, PM releases commemorative coin of 75, Rs 75 coin

ఈ రోజు ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) యొక్క 75 వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. అలాగే ఇటీవల అభివృద్ధి చేసిన 17 రకాల బయోఫోర్టిఫైడ్ పంటలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలో పోషకాహార లోపాన్ని తొలగించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి మరియు ఆకలిని నిర్మూలించడానికి ఎఫ్‌ఏవో సహాయపడిందని, అలాగే పోషకాహారాన్ని పెంచడంలో భారీ పాత్ర పోషించిందని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించడం కూడా ఎఫ్‌ఏవోకు పెద్ద విజయమని అన్నారు.

కొన్ని పంటల యొక్క సాధారణ రకాలలో సూక్ష్మపోషకాలు లేవని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అందువలన ఈ లోపాలను అధిగమించడానికి బయోఫోర్టిఫైడ్ రకాలు అభివృద్ధి చేయబడ్డాయని చెప్పారు. పోషకాహార ప్రచారాన్ని బలోపేతం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన దశ అన్నారు. గోధుమ మరియు వరితో సహా అనేక స్థానిక మరియు సాంప్రదాయ పంటలలో 17 బయోఫోర్టిఫైడ్ విత్తన రకాలను రైతులకు అందుబాటులో తెస్తున్నామని అన్నారు. చిన్న రైతులకు బలం చేకూర్చాలని దేశంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓ) అభివృద్ధి చేయబడుతున్నాయని ప్రధాని అన్నారు. భారతదేశంలో ధాన్యం వృధా ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉందని, ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో సవరణలు ఈ పరిస్థితిని మారుతుందని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేసే ఎక్కువ అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =