ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్స్‌లో ఓటమి.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర భావోద్వేగం

Indian Tennis Star Sania Mirza Got Emotional as She Ends Her Grand Slam Career with Defeat in Australian Open Mixed Doubles Final,Indian Tennis Star Sania Mirza,Sania Mirza Got Emotional,Ends Her Grand Slam Career with Defeat,Grand Slam,Australian Open Mixed Doubles,Australian Open Mixed Doubles Final,Mango News,Mango News Telugu,Sania Mirza Latest News And Updates,Sania Mirza Wikipedia,Sania Mirza Son,Sania Mirza Sister,Sania Mirza Retirement,Sania Mirza Ranking,Sania Mirza Pilot,Sania Mirza Olympics,Sania Mirza Net Worth,Sania Mirza Husband

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్స్‌లో ఓటమి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. భారతదేశంలోని అత్యుత్తమ క్రీడాకారిణుల్లో ఒకరిగా గురింపు తెచ్చుకున్న సానియా మీర్జా తన గ్రాండ్‌స్లామ్ ప్రయాణానికి నేటితో ముగింపు పలికారు. రోహన్ బొపన్నతో కలిసి ఈ టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లిన ఆమె చివరి మెట్టుపై బోల్తాపడ్డారు. ఫైనల్లో సానియా, బోపన్న జోడీ బ్రెజిల్ జంట లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో 6-7, 2-6 తేడాతో ఓడిపోయింది. ఇక చివరిగా 2009లో సానియా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం సానియా ఫేర్ వెల్ స్పీచ్ ఇస్తూ తన టెన్నిస్ ప్రయాణం గురించి తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ.. ‘‘నా వృత్తిపరమైన కెరీర్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రారంభమైంది. 18 ఏళ్ల వయసులో 2005లో సెరెనా విలియమ్స్ తో తలపడ్డాను. ఒక గ్రాండ్ స్లామ్ కెరీర్ ను ముగించడానికి ఇంతకంటే పెద్ద వేదిక ఉండదు. ఇక్కడి రాడ్ లేవర్ ఎరీనా నా జీవితంలో ప్రత్యేకమైనది. నా కొడుకు ముందు నేను గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో ఆడగలనని ఎప్పుడూ అనుకోలేదు. నా సొంతింట్లో ఉన్న భావన కలిగించిన మీ అందరికీ థ్యాంక్యూ’ అని సానియా వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌లో సానియా తన చివరి టోర్నమెంట్‌ను ఆడనున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023తో తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు 36 ఏళ్ల సానియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సానియా కెరీర్‌లో ఇది 11వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా.. ఆరు గ్రాండ్ స్లామ్‌లతో సహా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. అలాగే గతంలో మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాల పాటు డబ్ల్యూటీఏ నంబర్ 1 ప్లేయర్‌గా సానియా కెరీర్ బెస్ట్ సాధించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − ten =