ఐపీఎల్-2023: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొత్త జెర్సీ ఆవిష్కరణ

Lucknow Super Giants Unveiled Their New Jersey For The Upcoming IPL 2023,Lucknow Super Giants IPL 2023,Lucknow Super Giants Unveiled New Jersey,IPL 2023,Lucknow Super Giants Upcoming IPL Jersey,Lucknow Super Giants New Jersey 2023,Mango News,Mango News Telugu,Lucknow Super Giants Launch New Jersey, Kl Rahul Led Lucknow Super Giants,IPL 2023 News Updates,IPL Latest News And Updates,Lucknow Super Giants 2023 Players List,Lucknow Super Giants Launch,Lucknow Super Giants 2023

రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 కోసం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి శరవేగంగా ఏర్పాట్లు చేస్తుండగా, అన్ని జట్లు సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు ఇకపై సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తమ జట్టు యొక్క కొత్త జెర్సీని మంగళవారం ఆవిష్కరించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా, జట్టు యజమాని, ఆర్పీఎస్జీ గ్రూప్‌ గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా, జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, మెంటర్ గౌతమ్ గంభీర్‌ లక్నో సూపర్ జెయింట్స్ యొక్క కొత్త జెర్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్, అవేష్ ఖాన్, కృనాల్ పాండ్యా దీపక్ హుడా సహా పలువురు జట్టు ఆటగాళ్లు పాల్గొన్నారు. కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్న లక్నో ఫ్రాంచైజీ ఐపీఎల్-2022లో ఆకుపచ్చ-నీలం రంగు జెర్సీ ధరించగా, ఈసారి కాస్త ఆరంజ్ మరియు ఆకుపచ్చ రంగులతో కూడిన ముదురు నీలం రంగు జెర్సీలోకి మారారు.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తన ప్రస్థానాన్ని ఐపీఎల్‌-2022 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. లక్నో జట్టు వేలానికి ముందే కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా, మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ మెంటార్ గా ఎంచుకుంది. తోలి సీజన్ లో మొత్తం 14 లీగ్ మ్యాచుల్లో లక్నో సూపర్ జెయింట్స్ 9 విజయాలు సాధించి, మంచి ఫలితాలను నమోదు చేసింది. 18 పాయింట్స్, +0.251 నెట్ రన్ రేటుతో పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరుపై ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో రాబోయే ఐపీఎల్-2023లో కెప్టెన్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 20 =