ఇండియా టుడే సర్వేలో ఆసక్తికర పేర్లు

PM Modi ,Who is Prime Minister Modi's successor?, Interesting names, India Today survey,Prime Minister Modi, Amit Shah, Yogi Adityanath, Nitin Gadkari, BRS, Indian Prime Minister Narendra Modi,Indian PM Narendra Modi,Narendra Modi,PM Narendra Modi, Mango News Telugu, Mango News
PM Modi ,Who is Prime Minister Modi's successor?, Interesting names, India Today survey,Prime Minister Modi, Amit Shah, Yogi Adityanath, Nitin Gadkari

ఇప్పుడు దేశం అంతటా ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికలకు రెడీ అవడంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో  బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని చెప్పిన ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ..  తాజాగా మరో ఆసక్తికర అంశంపై జనాభిప్రాయాన్ని బయటపెట్టడం హాట్ టాపిక్ అయింది.

బీజేపీలో ప్రధాని మోడీ వారసుడిగా ఎవరు ఉంటే బెటరన్న సర్వేలో ఆసక్తికర పేర్లు బయటకు వచ్చాయి.  కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 29 శాతం మంది ఓటు చేయగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను 25 శాతం మంది ఎన్నుకున్నారు. అలాగే  నితిన్ గడ్కరీని 16 శాతం మంది కోరుకుంటున్నారని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది. గతేడాది డిసెంబర్ 15, 2023 నుండి జనవరి 28, 2024 మధ్యకాలంలో ఈ  సర్వే నిర్వహించినట్లు ఇండియా టుడే తెలిపింది.

ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోడీనే అని చాలామందికి ఇప్పటికే ఓ అభిప్రాయం ఉంది. అయితే భారతీయ జనతాపార్టీలో రాజకీయ వ్యూహాలు, విజయాల వెనుక అమిత్ షా కూడా ఉన్నారన్న విషయం తెలిసిందే. అందుకే అమిత్ షాను  బీజేపీ ‘చాణక్య’గా పిలుస్తుంటారు. ఇక యూపీ మఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్న యోగి ఆదిత్యానాథ్ కొద్దికాలంలోనే బీజేపీలోనే  విశేష ఆదరణ పొందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇటు పార్టీ శ్రేణుల్లోనూ తన ఇమేజ్‌ను పెంచుకుంటూ.. కార్యకర్తల్లో గౌరవాన్ని పొందారు. హిందూత్వ నాయకుడు కావడం, వివాదాలు ఉన్నప్పటికీ కూడా నేరస్థుల అణిచివేతకు ఆదిత్యానాథ్ అవలంభిస్తున్న విధానాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి.

ఇక రాజకీయ వర్గాల్లో వీరి తర్వాత ప్రశంసలు అందుకుంటున్న అగ్రనేత నితిన్ గడ్కరీ.. ప్రధానమంత్రి అయితే బాగుంటుందని 16 శాతం మంది కోరుకుంటున్నారు. రాజకీయ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపగల నేతలగా పేరు పొందిన నితిన్ గడ్కరీని  ప్రతిపక్ష నాయకులు సైతం ప్రశంసిస్తుంటారు. నితిన్ గడ్కరీ ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోడీ ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పాటు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ  చరిష్మా అద్భుతంగా పనిచేయడం వల్లే కాషాయ పార్టీ ఆయా రాష్ట్రాలలో కళకళలాడింది. ఇప్పుడు  ముచ్చటగా మూడోసారి కూడా బీజేపీనే కేంద్రంలో అధికారాన్ని దక్కించుకుంటుందని  ‘ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే చెబుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 11 =