లాక్‌డౌన్‌ పొడిగింపుపై మరోసారి స్పష్టత నిచ్చిన కేంద్రం

Fact Check Over False Rumors on Coronavirus, India Lockdown extension FACT CHECK, Lockdown Extension, Lockdown Extension Rumours, Lockdown Extension Rumours on Social Media, No lockdown extension, PIB Fact Check, PIB Fact Check Clarifies Rumours over Complete Lockdown, PIB Fact Check Denies Lockdown Extension Rumours, PIB India on Twitter

దేశంలో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలు, వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. అలాగే ఢిల్లీలో జూన్ 18 నుంచి మళ్ళీ పూర్తిస్థాయిలో కఠినమైన లాక్‌డౌన్ అమలు చేయబోతున్నారని, ప్రెసిడెంట్ రూల్ కూడా విధించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో సందేశాల ద్వారా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిఐబి (భారత ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం) ఫాక్ట్ చెక్ స్పందించింది. మళ్ళీ కఠినమైన లాక్‌డౌన్ అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ న్యూస్ అని, లాక్‌డౌన్‌ ప్రణాళిక అసలు పరిశీలనలో లేదని చెప్పారు. ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ తప్పుదోవ పట్టించే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండని పిఐబి ఫాక్ట్ చెక్ వెల్లడించింది. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, సంబంధిత విషయాలపై సోషల్ మీడియాలో జరిగే అనేక తప్పుడు ప్రచారాలపై పిఐబి ఫాక్ట్ చెక్ నిజ నిర్ధారణ చేసి వివరణ ఇస్తూ ఉంటుంది.

మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో దేశంలో మూడు రోజులుగా ప్రతిరోజూ 11 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ 14, ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,32,424 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జూన్ 16, 17 వ తేదీల్లో అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పీఎం నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 1 =