దేశంలో కరోనా పరిస్థితులపై పీఎం మోదీ కీలక సమావేశం

Coronavirus Cases In India, Coronavirus Deaths In India, Coronavirus In India, Modi Meeting with Senior Ministers, Modi Meeting with Senior Ministers Over Covid 19, PM Modi, PM Modi Meeting with Senior Ministers, PM Modi review India’s response to COVID-19, pm narendra modi, Prime Minister Narendra Modi

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో బాధితుల సంఖ్య శనివారం ఉదయానికి 3,08,993 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై పీఎం నరేంద్ర మోదీ ఈ రోజు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీతిఆయోగ్ సభ్యుడు, ఎంపవర్డ్ గ్రూప్-1 చైర్మన్ డాక్టర్ వినోద్ పాల్ దేశంలో నెలకొన్న ప్రస్తుత కరోనా పరిస్థితులపై పీఎం మోదీకి వివరించినట్టు తెలుస్తుంది. అలాగే మొత్తం కేసులలో మూడింట రెండు వంతులు 5 రాష్ట్రాల్లో ఉన్నాయని, అదికూడా ఆ రాష్ట్రాల్లోని నగరాల్లోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.

రోజువారీగా కరోనా కేసుల పెరుగుతుండడంతో పెద్ద నగరాలు సవాళ్లు ఎదుర్కొంటున్న దృష్ట్యా, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పరీక్షలను పెంచడం మరియు పడకలు, ఆసుపత్రుల్లో సదుపాయాలు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీలో పరిస్థితులను లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో హోమ్ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలని పీఎం మోదీ సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్, పలువురు కేంద్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =