ఒలింపిక్స్ లో మహిళల హాకీ జట్టు అద్భుతప్రదర్శనపై ప్రశంసలు, హర్యానా సీఎం 50 లక్షల నజరానా ప్రకటన

Brave Indian women create history, Hockey Team Creates History, Indian women hockey team create history, Indian Women’s Hockey Team, Mango News, Olympics 2021 LIVE, PM Modi Praises Indian Women’s Hockey Team, President Kovind, President Kovind PM Modi Praises Indian Women’s Hockey Team for Stellar Performance at Tokyo Olympics, Semi Finals Tokyo Olympics, Tokyo 2020, Tokyo 2020 Indian Women’s Hockey Team Make History, Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో సంచనాలు నమోదు చేసిన భారత మహిళల హాకీ జట్టు పతకం సాధించకుండానే వెనుదిరిగింది. శుక్రవారం ఉదయం కాంస్య పతకం కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రిటన్‌ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 3-4 గోల్స్‌ తేడాతో ఓటమి పాలైంది. ఓ దశలో అద్భుతంగా పోరాడి ముందంజలో నిలిచిన్నప్పటికీ, చివర్లో పట్టుకోల్పోవడంతో పతాకానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయారు. ముందుగా రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా సెమీఫైనల్ కు చేరుకుంది. బుధవారం నాడు జరిగిన సెమీఫైనల్లో అర్జెంటైనాపై ఓడిపోయి చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. తాజాగా తృటిలో కాంస్య పతకం కూడా కోల్పోవడంతో మహిళల హాకీ క్రీడాకారిణిలు కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఓడిపోయినప్పటికీ తమ ప్రతిభతో దేశం మొత్తాన్ని ఆకట్టుకున్న మహిళా జట్టుకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటుగా పలువురు రాజకీయ, క్రీడా, సినీరంగ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా హాకీ జట్టు పోరాటపటిమపై ప్రశంసలు కురిపించారు. “భారత మహిళల హాకీ జట్టు మైదానంలో రాణించింది మరియు వారి అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి భారతీయుడి హృదయాలను గెలుచుకుంది. మీ అందరి పట్ల మేము గర్విస్తున్నాము” అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు.

టోక్యో ఒలింపిక్స్-2020 లో మహిళల హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒలింపిక్స్ లో వారు ఉత్తమమైన ప్రతిభ చూపారని అన్నారు. జట్టులోని ప్రతి క్రీడాకారిణి అద్భుతమైన ధైర్యం, నైపుణ్యం మరియు స్థితిస్థాపకత కలిగిఉన్నారని, ఈ అత్యుత్తమ జట్టుపై భారత్ గర్వపడుతోందని ప్రధాని అన్నారు. మనం మహిళల హాకీలో పతకాన్ని కోల్పోయాము, కానీ ఈ బృందం న్యూ ఇండియా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. మరీ ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్-2020 లో వారి విజయాలు, పోరాటపటిమ చూసాక, భారతదేశంలోని ఆడపిల్లలు హాకీని ఆడడానికి మరియు అందులో రాణించడానికి ప్రేరేపిస్తుందని అన్నారు. ఈ జట్టు పట్ల గర్వపడుతున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.

50 లక్షల నజరానా:

మరోవైపు ఒలింపిక్స్ లో భారత మహిళా హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రశంసించారు. హర్యానాకు చెందిన ఒలింపిక్స్ మహిళల హాకీ జట్టులోని తొమ్మిది మంది సభ్యులకు హర్యానా ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.50 లక్షలు అందజేస్తుందని చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =