నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

President Kovind Presents Nari Shakti Puraskar–2020 and 2021 on the Occasion of International Women’s Day, President Kovind Presents Nari Shakti Puraskar–2020 and 2021, Nari Shakti Puraskar–2020 and 2021, Nari Shakti Puraskar–2020, Nari Shakti Puraskar–2021, President Kovind, President Kovind Presents Nari Shakti Puraskar On This Occasion, Ram Nath Kovind, Kovind, Nari Shakti, Ram Nath Kovind, President of India, Ram Nath Kovind President of India, International Women's Day Latest News, International Women's Day Latest Updates, International Women's Day Live Updates, Mango News, Mango News Telugu,

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ‘నారీ శక్తి పురస్కార్’- 2020 మరియు 2021 ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021 సంవత్సరాలకు సంబంధించి 29 మంది అత్యుత్తమ మరియు అసాధారణమైన మహిళా సాధకులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ముందుగా 2020 సంవత్సరానికి సంబంధించి 14, 2021 సంవత్సరానికి 14 చొప్పున మొత్తం 28 అవార్డులు కోసం బలహీన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళాల సాధికారత కోసం చేసిన విశేష కృషికి గుర్తింపుగా 29 మంది మహిళలను ఎంపిక చేశారు. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల కారణంగా 2020 సంవత్సరానికి అవార్డు వేడుకను 2021లో నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో రెండు సంవత్సరాలకు ఎంపికైన మహిళలకు నేడు పురస్కారాలు అందజేశారు.

మహిళల విజయాలను గుర్తించేందుకు, మహిళా సాధికారత మరియు సాంఘిక సంక్షేమం కోసం వారి నిర్విరామ సేవకు గుర్తింపుగా, మహిళలు మరియు సంస్థలకు కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నారీశక్తి పురస్కారాలను అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు సోమవారం నాడు నారీ శక్తి పురస్కార విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. అవార్డుకు ఎంపికైన వారిని ప్రధాని ప్రశంసిస్తూ, వారి సేవలతో సమాజంతో పాటు దేశానికి కూడా సహకరిస్తున్నారని అన్నారు. నారీ శక్తి పురస్కార గ్రహీతల్లో గణిత శాస్త్రవేత్త నీనా గుప్తా, సామాజిక వ్యవస్థాపకురాలు అనితా గుప్తా, ఆర్గానిక్ ఫార్మర్ మరియు ట్రైబల్ ఆక్టివిస్ట్ ఉషాబెన్ దినేష్‌భాయ్ వాసవా, ఇంటెల్-ఇండియా హెడ్ నివృత్తి రాయ్, మొదటి మహిళా స్నేక్ రెస్క్యూర్ వనితా జగదేవ్ బోరాడే, కథక్ డ్యాన్సర్ సాయిలీ నంద్‌కిషోర్ అగవానే, మర్చంట్ నేవీ కెప్టెన్ రాధికా మీనన్ తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − four =