ఏప్రిల్ 13న రోజ్‌గార్ మేళా కింద.. 71,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ

PM Modi To Distribute 71000 Appointment Letters to Newly Inducted Recruits Under Rozgar Mela on April 13,PM Modi To Distribute 71000 Appointment Letters,Appointment Letters to Newly Inducted Recruits,Recruits Under Rozgar Mela on April 13,Mango News,Mango News Telugu,PM Rozgar Mela 2023,Rozgar Mela,Under Rozgar Mela,PM to distribute 71000 appointment letters,PM Rozgar Mela 2023 Latest News,PM Rozgar Mela 2023 Latest Updates,PM Rozgar Mela 2023 Live News,Rozgar Mela Appointment Letters Latest News,Rozgar Mela Appointment Letters News Today

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 13న కొత్తగా చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 71,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ‘రోజ్‌గార్ మేళా’ డ్రైవ్‌లో భాగం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోజ్‌గార్ మేళా ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు.. 2024లో వచ్చే లోక్‌సభ ఎన్నికలలోపు సుమారు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రోజ్‌గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, యువతకు వారి సాధికారత మరియు జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్ధవంతమైన అవకాశాలను అందిస్తుందని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.

ఇక ఈ సందర్భంగా 13 ఏప్రిల్, 2023 తేదీన ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేసిన అనంతరం ప్రధాని మోదీ అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా దేశవ్యాప్తంగా 71వేల మంది రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అకౌంటెంట్స్, పోస్టల్ అసిస్టెంట్స్, సీనియర్ డ్రాట్స్‌మన్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, టీచర్స్, లైబ్రేరియన్స్, నర్సులు, ప్రొబేషనరీ ఆఫీసర్లు వంటి వివిధ ఉద్యోగాలు/పోస్టులలో చేరనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు ద్వారా శిక్షణ ఇస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =