అమెరికా ఎన్నికలు-2020: డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్‌ మధ్య రెండో డిబేట్ రద్దు

US Election 2020: 2nd Presidential Debate between Trump and Joe Biden Officially Cancelled

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థుల మధ్య బహిరంగంగా మూడుసార్లు డిబేట్ నిర్వహించడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ మూడు డిబేట్ లను కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్(సీపీడీ) నిర్వహిస్తుంది. అధ్యక్ష పదవికి బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య ఇప్పటికే తోలి డిబేట్ జరిగింది. అయితే వీరిద్దరి మధ్య అక్టోబర్ 15 న జరగాల్సిన రెండవ డిబేట్ ను రద్దు చేస్తున్నట్లు సీపీడీ అధికారికంగా ప్రకటించింది.

మొదటి డిబేట్ అనంతరం ట్రంప్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయినప్పటికీ డిబేట్ లో పాల్గొనే ఇతరుల ఆరోగ్యం దృష్ట్యా రెండో డిబేట్ ను వర్చువల్‌గా నిర్వహించాలని సీపీడీ నిర్ణయించింది. వర్చువల్ ఫార్మాట్ ‌లో చర్చను నిర్వహించడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తూ, అలా అయితే తాను పాల్గొనబోనని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు‌ ట్రంప్‌తో నేరుగా చర్చలో పాల్గొనని జో బిడెన్ పేర్కొంటూ, డిబేట్ జరగాల్సిన సమయంలో ఇతర కార్యక్రమాలకు షెడ్యూల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండో డిబేట్ నిర్వహించడం సాధ్యం కాదని, రద్దు చేస్తునట్టు సీపీడీ ప్రకటించింది. కాగా అక్టోబర్ 22న జరగాల్సిన చివరిదైనా మూడో డిబేట్ లో పాల్గొనేందుకు డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్ అంగీకరించినట్లుగా సీపీడీ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =