వైసీపీ ఐదో జాబితా వచ్చేది అప్పుడే..

The Fifth List Of YCP Will Come Just Then, YCP, YCP Fifth List, CM Jagan, AP Elections, Fifth List Of YCP, YCP Will Come Just Then, Latest YCP Fiftth List, YCP Fiftth List News, YCP Political News, YCP News Updates, chandrababu, Andra Pradesh, YCP Elections News, Political News, AP, Mango News, Mango News Telugu
YCP, YCP Fifth List, CM jagan, AP Elections

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ అభ్యర్థుల జాబితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన వైసీపీ.. ప్రస్తుతం ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది. అయితే వైసీపీ హైకమాండ్ ఒక్కరిద్దరిని కాకుండా వరుస పెట్టి సిట్టింగ్‌లను మార్చడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఇప్పటి వరకు 58 అసెంబ్లీ స్థానాలకు.. 10 లోక్ సభ స్థానాలకు వైసీపీ ఇంచార్జ్‌లను మార్చేసింది. ఇప్పుడు ఐదో జాబితా ద్వారా మరికొంత మంది సిట్టింగ్‌లను మార్చేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తోంది. రేపో, మాపో వైసీపీ ఐదో జాబితా వెలువడనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఐదో జాబితాలో నంద్యాల, నరసరావుపేట, గుంటూరుతో పాటు మరో నాలుగైదు లోక్ సభ స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఆయా స్థానాల్లో సిట్టింగ్‌లను పక్కకు పెట్టి కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారట. ఈక్రమంలో ఐదో జాబితాకు సంబంధించి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో.. నేతలంతా సీఎంవోకు తరలివెళ్తున్నారు. టికెట్ దక్కని వారు అలకబూనడంతో.. వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత ఇచ్చి.. మంచి పదవి కట్టబెడుతామని జగన్ హామీ ఇస్తున్నారట.

ప్రస్తుతం నంద్యాల సిట్టింగ్ ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను పక్కకు తప్పించి మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట. ఈక్రమంలో సినీనటుడు అలీ, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఖాదర్ బాషాల పేర్లను జగన్ పరిశీలిస్తున్నారట. వీరిద్దరిలో ఒకరిని ఖరారు చేసి ఐదో జాబితాలో ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అలాగే ప్రస్తుతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగావున్న లావు శ్రీకృష్ణ దేవరాయలును గంటూరు నుంచి పోటీ చేయించనున్నారట. అలాగే నరసాపుర్ నుంచి కొత్త వ్యక్తిని బరిలోకి దింపేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారట.

ఇక అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌కు జగన్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి అమర్నాథ్‌ను అక్కడి నుంచి తప్పించి భరత్ కుమార్‌ను అనకాపల్లి ఇంఛార్జ్‌గా నియమించారు. ఈక్రమంలో అసంతృప్తికి గురైన అమర్నాథ్‌ను జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయనకు పెందుర్తి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారట. లేదంటే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తామని జగన్.. అమర్నాథ్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =