వారం రోజుల్లో ఇంటింటి ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం : సీఎస్ సోమేశ్ కుమార్

Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Door to Door Fever Survey at Hyderabad, Fever Survey, Fever Survey In Telangana, Harish Rao, Harish Rao Announces Fever Survey, Mango News, telangana, Telangana Coronavirus, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Inspected Door to Door Fever Survey, Telangana CS Somesh Kumar Inspected Door to Door Fever Survey at Hyderabad, Telangana Fever Survey, Telangana Health Minister, Telangana Health Minister Harish Rao, Telangana Health Minister Harish Rao Announces Fever Survey to be Starts, Telangana Health Minister Harish Rao Announces Fever Survey to be Starts From Tomorrow

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ మూడవ విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న ప్రక్రియను ఖైరతాబాద్ లోని హిల్ టాప్ కాలనీలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ, కోవిడ్ మూడవ విడతతోగానీ, ఒమిక్రాన్ తోగానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తిని పరిశీలిస్తే, క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలనైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టంచేశారు.

కోటికి పైగా మెడికల్ కిట్ లను సిద్ధం, రోజుకు లక్ష పరీక్షలు:

ఇప్పటికే కోటికి పైగా మెడికల్ కిట్ లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వారం రోజుల్లోగా పూర్తి చేసే ఈ ఇంటింటి సర్వేకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖలకు చెందిన సభ్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటిoటికీ ఆరోగ్యం పేరుతో ఇంటింటి ఫీవర్ సర్వే నేడు ప్రారంభమైందని, ఒక్కొక్క టీమ్ లో ఆశా/ఏ.ఎన్.ఎం/మున్సిపల్/పంచాయితీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బందులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కోవిడ్ లక్షణాలుంటే మెడికల్ కిట్ ను అందచేస్తారని వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ తో కలిపి దాదాపు 56 వేల పడకలు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ ఉందని అన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం చేపట్టిన ఈ ఇంటింటి జ్వర సర్వేను నీతిఆయోగ్ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా నడుస్తోందని అన్నారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ఇంటింటి ఫీవర్ సర్వే విజయవంతంగా జరిగి, సత్ఫలితాలను ఇచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4846 కాలనీల్లో, బస్తీల్లో కూడా ఇంటింటి సర్వే విజయవంతంగా ప్రారంభమైనదని అన్నారు. ఈ సందర్బంగా ఖైరతాబాద్ హిల్ టాప్ కాలనీలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − four =