రాజీనామా చేసిన కర్ణాటక ఎమ్మెల్యేలను స్పీకర్ ముందు హాజరవ్వమన్న సుప్రీం కోర్టు

Apex court allows rebel Karnataka MLAs to meet Speaker, Karnataka crisis Live Updates, Mango News, SC Asks Rebel Karnataka MLAs To Meet Speaker, SC Asks Rebel MLAs To Meet Speaker Today, SC orders 10 rebel Karnataka MLAs to appear before Speaker, Supreme Court orders Karnataka Speaker to meet Speaker, Supreme Court Orders Rebel MLAs To Meet Speaker Today
  • అసమ్మతి నేతలను స్పీకర్ ముందు విచారణ కి హాజరవ్వాలన్న సుప్రీం కోర్టు
  • రాజీనామా చేసే అవసరం లేదన్న కుమారస్వామి
  • ముంబయి నుంచి బెంగుళూరు చేరుకున్న డీకే శివకుమార్

కర్నాటక లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతూనే ఉంది, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్‌ అసమ్మతి నేతల రాజీనామా ను ఆమోదించక పోవడంతో, స్పీకర్ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవరిస్తున్నారని స్పీకర్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు సభ్యులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసారు. ఈ పిటిషన్‌ను ఈ రోజు న సుప్రీంకోర్టు విచారించింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ సాయంత్రం లోపు స్పీకర్ ముందు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. రాజీనామాలను కావాలనే ఆమోదించడం లేదన్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనను తోసిపుచ్చుతూ, స్పీకర్ నిర్ణయం తమకేం ఆశ్చర్యంగా లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఎమ్మెల్యేలు అందరూ బెంగుళూరు చేరుకునేందుకు తగిన భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీ కి సూచించింది. రాజీనామా అంశాలపై రేపటిలోగా ప్రభుత్వం మరియు స్పీకర్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరిగా విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు తన రాజీనామా వార్తలను సీఎం కుమారస్వామి ఖండించారు, బిజెపి ఆడుతున్న నాటకంలో తాము బలి అవ్వడానికి సిద్ధంగాలేమని చెప్పారు, తనకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ రోజు కుమారస్వామి కాంగ్రెస్ నేతలు సిద్దరామయ్య, కేసి వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్ లతో సమావేశమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here