వైద్యరంగంలో స్వాంటే పాబోకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ప్రకటన

Nobel Prize 2022, Svante Paabo Wins Award In Medicine, Swedish Geneticist Svante Paabo, Mango News, Mango News Telugu, Svante Paabo Wins Nobel Prize, Svante Paabo Won Nobel Prize 2022, Svante Paabo Nobel Prize on Physiology, Svante Paabo Nobel Prize in Medicine Category, Svante Paabo Latest News And Updates, Svante Paabo Swedish Geneticist, Svante Paabo Physiology

వైద్యశాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు 2022 సంవత్సరానికి గానూ స్వీడన్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన నోబెల్‌ బహుమతి లభించింది. ఫిజియాలజీ లేదా మెడిసిన్‌ లో స్వాంటే పాబోకు నోబెల్ బహుమతి లభించినట్టు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్ కమిటీ కార్యదర్శి థామస్ పెర్ల్‌మాన్ సోమవారం ప్రకటించారు. అంతరించిపోయిన హోమినిన్‌ల జన్యువులు మరియు మానవ పరిణామానికి సంబంధించిన ఆవిష్కరణలకు గానూ స్వాంటే పాబో నోబెల్ బహుమతి దక్కించుకున్నట్టు తెలిపారు

ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీద ఇచ్చే ఈ ఘన పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి (డిసెంబర్‌ 10) సందర్భంగా ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. వైద్యశాస్త్రంలో సేవలందిస్తున్నవారికి 1901 నుంచీ నోబెల్‌ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారం కింద దాదాపు 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (రూ.6,598,203.25) ను బహుమతిగా అందజేయనున్నారు. వైద్య శాస్త్రంలో నోబెల్‌ విజేతలను అక్టోబర్ 3న ప్రకటించగా, అక్టోబర్ 4న భౌతిక శాస్త్రం, అక్టోబర్ 5న రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేసిన వారికి పురస్కారాలను ప్రకటించనున్నారు. అలాగే డబుల్‌ హెడర్‌ సాహిత్య ప్రైజ్‌ను అక్టోబర్ 6, శాంతి నోబెల్‌ బహుమతిని అక్టోబర్ 7వ తేదీలలో, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 10న ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 6 =