మునుగోడులో మాకు కాంగ్రెస్ పార్టీతోనే ప్రధాన పోటీ, అయినా టీఆర్ఎస్‌దే విజయం – మంత్రి జగదీష్ రెడ్డి

Telangana Minister Jagadish Reddy Expresses Confidence on TRS Party Victory in Munugode By-Poll, Telangana Minister Jagadish Reddy, Jagadish Reddy Confidence on TRS Party Victory, Minister Jagadish Reddy, Mango News, Mango News Telugu, TRS Minister Jagadish Reddy, TRS Party Victory in Munugode By-Poll, TRS Party Victory, TRS Party, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడులో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీయేనని, అయినా టీఆర్ఎస్‌దే విజయమని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేష‌న్‌ విడుదలైన నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంద‌ని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ త‌ప్ప‌క గెలిచి తీరుతుంద‌ని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలనే ఫణంగా పెట్టారని గుర్తు చేసిన ఆయన, ప్ర‌జ‌ల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న సీఎం కేసీఆర్‌ను ఓడించ‌డం ఎవ‌రి తరం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌ పార్టీ సమావేశం తర్వాత బీజేపీ అగ్రనాయకత్వం భయపడిందని, అందుకే ఆఘమేఘాలపై మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేష‌న్‌ విడుదలైందని మంత్రి అన్నారు.

దేశంలో నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతులకు మీటర్లు పెట్టడం వంటివి చూశాక ప్రజలకు బీజేపీపై అపనమ్మకం ఏర్పడిందని, ఇలాంటి సమయంలో వచ్చిన ఈ మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి వారు సిద్ధంగా ఉన్నారని జ‌గ‌దీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌కు జాతీయ రాజ‌కీయాల‌పై కూడా పూర్తి అవగాహన ఉందని, ఆయనను దేశ రాజకీయాల్లోకి రావాల్సిందిగా పలు రాష్ట్రాల నుంచి వినతులు వస్తున్నాయని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు దేశ‌వ్యాప్తంగా అమలు చేయాలని మిగిలిన రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని, వారి అభీష్టం త్వరలోనే తీరుతుందని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 11 =