కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, ఇకపై ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

Cooperative Banks Brought under RBI Supervision, Modi Union Cabinet Meeting, PM Modi chairs Union Cabinet meeting, Union Cabinet, Union Cabinet Decisions, Union Cabinet Decisions Today, Union Cabinet Meeting Highlights, Union Cabinet Meeting Live Updates, Union Cabinet Meeting Today

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • దేశంలోని అన్ని సహకార బ్యాంకులు ఇకపై ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయి. ఈ ఆర్డినెన్సు కు కేబినెట్ ఆమోదం. 
  • ప్రధాన మంత్రి ముద్రయోజనలో శిశు విభాగం కింద రుణాలు తీసుకున్నవారికి వడ్డీలో రెండు శాతం రాయితీ. అర్హతకల్గిన లబ్దిదారులకు 12 నెలల పాటు రాయితీ లభించనుంది.
  • ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు.
  • ఓబీసీ ఉపవర్గీకరణ కమిషన్ గడువు మరో ఆరు నెలలు పొడిగింపు.
  • అంతరిక్ష రంగంలో సంస్కరణలు, ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి.
  • పశుసంవర్ధక మౌలిక సదుపాయాల ప్రత్యేక నిధికి కేబినెట్ ఆమోదం, అర్హత కల్గిన లబ్దిదారులకు వడ్డీలో మూడు శాతం రాయితీ.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 5 =